Maidaan OTT: తెలుగులోనూ ఓటీటీలోకి వచ్చేసిన అజయ్ దేవ్‌గణ్ ‘మైదాన్’.. ఎక్కడ చూడొచ్చంటే?

0
21
తెలుగులోనూ ఓటీటీలోకి వచ్చేసిన అజయ్ దేవ్‌గణ్

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ నటించిన లేటెస్ట్ సినిమా మైదాన్. హైదరాబాద్‍కు చెందిన లెజండరీ ఫుట్‍బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అమిత్ శర్మ తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ బయోపిక్ డ్రామాలో ప్రియమణి కథానాయికగా నటించింది. ఏప్రిల్ 10వ తేదీన థియేటర్లలో రిలీజైన మైదాన్ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. అలాగే కోచ్ పాత్రలో అజయ్ దేవగణ్ నటనకు విమర్శకుల ప్రశంసలు వచ్చాయి. అయితే అనకున్న స్థాయిలో మాత్రం కలెక్షన్లు రాలేదు. ఇక థియేటర్లలో మోస్తరుగా ఆడిన మైదాన్ సినిమా మే 22 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అజయ్ దేవ్‌ గణ్ సినిమా ఉంది. కానీ అది కేవలం హిందీ వెర్షన్ మాత్రమే. దీంతో తెలుగు వెర్షన్ లోనూ ఈ మూవీని తీసుకురావాలన్న డిమాండ్లు వచ్చాయి. ఇప్పుడు వారి కోసమే ఈ సూపర్ హిట్ మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అలాగే తమిళం, మలయాళం భాషల వెర్షన్ లను కూడా అందుబాటులోకి వచ్చింది. అంటే ప్రస్తుతం మైదాన్ సినిమా నాలుగు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

జీస్టూడియోస్, బేవ్యూ ప్రాజెక్ట్స్, ఫ్రెష్ లైమ్ ఫిల్మ్స్ బ్యానర్లు నిర్మించిన మైదాన్ సినిమాలో గిరిరాజ్ రావ్, దివ్యాన్ష్ త్రిపాఠి, రిషబ్ జోషి, నితాన్షి గోయెల్, ఆయేషా వింధార, మీనల్ పటేల్, రుద్రనీల్ ఘోష్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. 1950వ ద‌శ‌కంలో భారత ఫుట్‌బాల్ టీమ్ కోచ్‌గా ర‌హీమ్ (అజ‌య్ దేవ్‌గ‌ణ్‌) నియ‌మితుడ‌వుతాడు. అయితే ఈ ఆట‌లో బెంగాళీలదే ఆధిప‌త్యం ఎక్కువగా ఉంటుంది. ర‌హీమ్ కోచ్‌గా ఎంపికవ్వడం నచ్చని కొందరు కుట్రలు పన్నుతారు. రహీమ్ కోచ్ పదవి పోయేలా చేస్తారు. మరి ఈ సమస్యలను రహీమ్ ఎలా అధిగమించాడు? అతని మార్గదర్శకత్వంలో భారత ఫుట్‌బాల్ టీమ్ ఏషియ‌న్ గేమ్స్‌లో ఎలా ప‌త‌కం గెలిచింది అన్న‌దే మైదాన్ మూవీ క‌థ. మరి థియేటర్లలో ఈ మూవీని మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి మరి. ‌

ఇవి కూడా చదవండి

దక్షిణాది భాషల్లోనూ స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here