Mahesh Babu-Rajamouli: ఆషాఢం ఎఫెక్ట్.. మహేశ్ బాబు- రాజమౌళిల సినిమా ప్రారంభమయ్యేది అప్పుడే

0
31
ఆషాఢం ఎఫెక్ట్.. మహేశ్- రాజమౌళిల సినిమా ప్రారంభమయ్యేది అప్పుడే

ఆర్ఆర్ఆర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు దర్శక ధీరుడు రాజమౌళి. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో తన తర్వాతి సినిమా చేయనున్నారు. పాన్ వరల్డ్ రేంజ్ లో భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందనుందని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ చిత్రం కోసం మహేష్ కొన్నిరోజులుగా స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. మహేష్ లుక్ పూర్తిగా మారిపోయింది. లాంగ్ హెయిర్‏తో అచ్చం హాలీవుడ్ హీరోలా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలోనే పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారట మేకర్స్. అయితే ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర వార్త వినిపిస్తోంది. అదేంటంటే.. ప్రస్తుతం ఆషాడ మాసం కొనసాగుతోంది. ఆషాఢ మాసం జూన్ 23 నుంచి జూలై 21 వరకు కొనసాగనుంది. ఈ సమయంలో శుభకార్యాలతో పాటు ఎలాంటి పనులు ప్రారంభించడానికి ఎవరూ ఆసక్తి చూపరు. జక్కన్న కూడా ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారట. అందుకే ఈ సమయంలో తన కొత్త సినిమా ముహూర్తం పెట్టకూడదని రాజమౌళి నిర్ణయించుకున్నారట.

ఇవి కూడా చదవండి

‘SSMB29’ (వర్కింగ్ టైటిల్) పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో అడ్వెంచెరస్ థ్రిల్లర్ జానర్ లో ఉంటుందని ఇప్పటికే స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ హింట్ ఇచ్చారు. ఇక మహేష్ బాబు సినిమాలో హీరోయిన్‌గా ఇండోనేషియన్ బ్యూటీ చెల్సియా ఇస్లెన్‌ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే చెల్సియా ఇస్లెన్‌‌కు స్క్రీన్ టెస్ట్ కూడా నిర్వహించారట. అయితే దీనిపై ఇంకా స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి స్వరాలు సమకూర్చనున్నారు. దీనికి సంబంధించి ఆయన ఇప్పటికే రీ రికార్డింగ్ పనులు మొదలు పెట్టారట. రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు బాడీ బిల్డింగ్ చేస్తున్నాడని అంటున్నారు. విదేశాలకు వెళ్లిన తర్వాత స్పెషల్ ఫైట్స్ నేర్చుకున్నట్లు చెబుతున్నారు. వీటితో పాటు మహేష్ బాబు సినిమా కోసం రాజమౌళి చాలా ప్లాన్ చేస్తున్నారు. వివిధ భాషలకు చెందిన ఆర్టిస్టులు ఈ సినిమాలో నటిస్తున్నారు. త్వరలోనే ఎస్ఎస్ఎంబీ ప్రాజెక్టుపై మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here