సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఆ పేరు ఓ వైబ్రేషన్ ఉంది.. ఓ సెన్సేషన్ ఉంది. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే ఫ్యాన్స్ కు పూనకాలే. అంతే కాదు విపరీతమైన లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఆయన. ఇప్పటివరకు మహేష్ బాబు పాన్ ఇండియా సినిమాలు చేయలేదు. కేవలం టాలీవుడ్ లో మాత్రమే సినిమాలు చేస్తున్నారు. అయినా కూడా ఈ పాన్ ఇండియా స్టార్ హీరోలకు లేని ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నారు. విదేశాల్లోనూ మహేష్ వీరాభిమానులు ఉన్నారు. త్వరలోనే మహేష్ బాబు రాజమౌళి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇదిలా ఉంటే మహేష్ నయా మూవీస్ తో పాటు గతంలో విడుదలై బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమాలు కూడా ఇప్పుడు రీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి.
ఇప్పటికే పోకిరి, ఒక్కడు సినిమాలు రీ రిలీజ్ అయ్యి నయా రికార్డ్ సృష్టించాయి. ఆతర్వాత చాలా మంది స్టార్ హీరోల సినిమాలు రీరిలీజ్ అయ్యాయి. ఇక ఇప్పుడు మరోసారి మహేష్ బాబు సినిమా రీ రిలీజ్ కానుంది. మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 9న మురారి సినిమా మరోసారి థియేటర్స్ లో సందడి చేయనుంది. దాంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఆగస్టు 9న మహేష్ రాజమౌళి సినిమాకు సంబందించిన అప్డేట్ వస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఎలాంటి అప్డేట్ ఉండదు అని తెలియడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశపడ్డారు.
కానీ మురారి సినిమా రీ రిలీజ్ ఉండటంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో మురారి పాటలు, పోస్టర్స్, వీడియోలతో హల్ చల్ చేస్తున్నారు. ఇక మహేష్ బాబు డై హార్ట్ ఫ్యాన్స్ మురారి పెళ్లి పత్రికను కూడా క్రియేట్ చేశారు. మురారి, వసుందర పెళ్ళికి ఆహ్వానిస్తున్నాం అంటూ ఓ వెడ్డింగ్ కార్డును క్రియేట్ చేశారు. ఈ పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఇప్పుడు మురారిలోని అలనాటి రామచంద్రుని సాంగ్ ను డీజే వర్షన్ ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. అలాగే మరికొన్ని పాటలకు మోహన్ లాల్ మాస్ డాన్స్ ను యాడ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ డీజే వర్షన్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియోల పై మీరూ ఓ లుక్కేయండి.
Mohan lal lekunda Murari edits entra#Murari4K pic.twitter.com/i1dsyUIo71
— KIRaN GaDU RA 🔥 (@KIRanGaDURA) July 16, 2024
మురారి సాంగ్స్ ..
The Vibe On!!🕺🔥#Murari4K #SSMB29 @urstrulyMahesh pic.twitter.com/wDeQQ5UFqa
— Vajrang ™ (@UrsVajrang) July 16, 2024
మురారి సాంగ్స్ ..
🗣️Murari Is a Classical Evergreen Film, How will you enjoy?
Me and My boys in Sudarshan 35mm-#Murari4k pic.twitter.com/XzRhxBLmIc— Vikk3964🌶️ (@saivikrant3964) July 16, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.