Mahesh Babu: ఎంత పని చేశావు మహేశా? అనంత్ అంబానీ పెళ్లి కోసం జక్కన్నకు ఇచ్చిన మాటను తప్పిన సూపర్ స్టార్

0
31
అనంత్ అంబానీ పెళ్లి కోసం.. జక్కన్నకు ఇచ్చిన మాట తప్పిన మహేశ్ బాబు

అపర కుబేరుడు ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌లో చాలా మంది పెద్ద సూపర్ స్టార్లు కనిపించారు. హాలీవుడ్, బాలీవుడ్ అలాగే సౌత్ ఇండస్ట్రీ నుంచి చాలా మంది నటీనటులు ఈ వివాహానికి హాజరయ్యారు. రామ్ చరణ్, మహేష్ బాబు, పవన్ కల్యాణ్, షారుఖ్ ఖాన్, రణబీర్ కపూర్, అలియా భట్, యష్, మాధురీ దీక్షిత్, ఐశ్వర్యా రాయ్, ప్రియాంకా చోప్రా, రణ్ వీర్ సింగ్, దీపికా పదుకొణె, రేఖ .. ఇలా సినిమా తారలందూ అంబానీల పెళ్లిలో హంగామా చేశారు. టాలీవుడ్ విషయానికి వస్తే.. రామ్ చరణ్, మహేశ్ బాబు కుటుంబ సమేతంగా అనంత్ అంబానీ, రాధికల వివాహానిక హాజరయ్యారు. ముఖ్యంగా ఈ పెళ్లిలో మహేశ్ బాబు తన స్టైలిష్ లుక్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. కాగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో మహేష్ బాబు ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై అభిమానుల్లో చాలా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా గురించిన కొత్త అప్ డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఈ సినిమా కోసం మహేష్ బాబు తన జుట్టు బాగా పెంచుతున్నాడని టాక్. అలాగే ఫిజిక్ పరంగానూ చాలా మారిపోయాడీ సూపర్ స్టార్. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల ఎంపిక జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా పనులు ప్రారంభం కానున్నాయి. కాఆ ఈ సినిమా పనులు మొదలు కాకముందే రాజమౌళి మహేష్ బాబు ముందు ఓ విచిత్రమైన కండిషన్ పెట్టాడట. అయితే అంబానీ పెళ్లి కోసం ఈ నిబంధనను మహేష్ బాబు బ్రేక్ చేశాడట.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సక్సెస్‌ తర్వాత రాజమౌళి ఎస్‌ఎస్‌ఎంబీ29 చిత్రాన్ని రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి తెలిసిన రోజు నుంచి జనాలు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. భారతీయ చలనచిత్రం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఇది ఒకటి. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు లుక్ రివీల్ చేయకూడదని రాజమౌళి నిర్ణయించుకున్నాడట. అందుకే మీడియాకు దూరంగా ఉండాలని మహేష్ బాబుకు సూచించాడట. అయితే ఇప్పుడు అనంత్ అంబానీ పెళ్లి కారణంగా తన లుక్‌ను మహేష్ బాబు రివీల్ చేశారు. అనంత్ అంబానీ, రాధికల వివాహానికి మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి హాజరయ్యారు. మహేష్ బాబు తన భార్య మరియు కుమార్తెతో కనిపించాడు.. మహేష్ బాబు స్వయంగా క్రికెటర్ ఎంఎస్ ధోనితో కలిసి ఉన్న చిత్రాన్ని పంచుకున్నారు. ఈ ఫోటోపై అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అనంత్ అంబానీ పెళ్లిలో మహేశ్ బాబు ఫ్యామిలీ..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here