Mahesh Babu: ‘అద్భుతం.. జస్ట్‌ వావ్‌’ కల్కి కి మహేష్ సూపర్ రివ్యూ…

0
35
Mahesh Babu: 'అద్భుతం.. జస్ట్‌ వావ్‌' కల్కి కి మహేష్ సూపర్ రివ్యూ...

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం ‘కల్కి’. నాగ్ అశ్విన తెరకెక్కించిన ఈ మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ జూన్29న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మొదటి షో నుంచే ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ప్రస్తుతం కల్కి సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. కనీవినీ ఎరగని కలెక్షన్లు సాధిస్తూ నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే 900 కోట్లు దాటేసిన కల్కి 1000 కోట్ల దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. మరోవైపు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఈ మూవీని చూస్తున్నారు. సినిమాపై సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఇక ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ కూడా.. కల్కి మూవీ గురించి ఓ ట్వీట్ చేశారు. తన ట్వీట్లో ఈ మూవీ రివ్యూ ఇచ్చేశారు. ఇక రీసెంట్గా కల్కి మూవీ చూసిన సూపర్ స్టార్ మహేష్‌ బాబు.. కల్కి సినిమా ఓ అద్భుతం.. జస్ట్‌ వావ్‌ అంటూ ట్వీట్ చేశారు. ఈ మూవీని డైరెక్ట్‌ చేసిన డైరెక్టర్ నాగి విజన్‌కు హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే అంటూ.. తన ట్వీట్లో కోట్ చేశారు మహేష్‌.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: హాలీవుడ్‌లో కల్కి ప్రభంజనం కెనడాలో ఏకంగా దిమ్మతిరిగే కలెక్షన్స్

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here