Mahesh Babu: సితార బర్త్ డే.. సొంతూరు బుర్రిపాలెంలో మహేశ్ బాబు ఏం చేశాడో తెలుసా? 157 మంది పిల్లలకు..

0
33
సితార బర్త్ డే.. సొంతూరు బుర్రిపాలెంలో మహేశ్ ఏం చేశాడో తెలుసా?

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు సినిమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటారు. ఇప్పటికే తన సొంతూరు బుర్రిపాలెంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారాయన. ఇక మహేశ్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేలాది మంది పేద పిల్లలకు ఉచితంగా హార్ట్ సర్జరీలు చేయిస్తున్నాడీ స్టార్ హీరో. తద్వారా వారి తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందాన్ని నింపుతున్నాడు. తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు మహేశ్ బాబు. తన గారాల పట్టి సితార ఘట్టమనేని పుట్టిన రోజు (జులై 20) సందర్భంగా తన సొంతూరైన గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మహేశ్ బాబు ఫౌండేషన్, ఆంధ్రా హాస్పిటల్స్ సంయుక్తంగా నిర్వహించిన ఈ మెడికల్ క్యాంప్ లో సుమారు 157 మంది పిల్లలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘ సితార పుట్టిన రోజును పురస్కరించుకని బుర్రిపాలెంలో ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాం. ఈ సందర్భంగా 157 మంది విద్యార్థులు ఈ మెడికల్ క్యాంప్ ను సద్వినియోగం చేసుకున్నారు. మహేశ్ బాబు, ఆంధ్రా హాస్పిటల్స్ కలిసి ఏర్పాటు చేసిన 40వ వైద్య శిబిరం ఇది.’

‘బుర్రిపాలెం గ్రామంలో ఇలాంటి వైద్య శిబిరాలు నిర్వహించడం ద్వారా ఇక్కడి ప్రజల్లో ఆరోగ్యంపై పూర్తిగా అవగాహన కల్పిస్తున్నాం. ఆంధ్రా హాస్పిటల్స్ కు చెందిన వైద్యులు పిల్లలకు ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత, చేతలు కడుక్కోవడం, డెండ్యూ, మలేరియా నివారణ, అలాగే సీజన్ వైరల్ ఇన్ఫెక్షన్లపై అవగాహన కల్పించారు. అలాగే పిల్లలకు అవసరమైన మందులు, విటమిన్ ట్యాబ్లెట్లను అందజేశారు. పోషకాహార లోపంతో బాధపడుతోన్న పిల్లలకు ప్రత్యేకమైన చికిత్స అంద జేశారు. పరిసరాల పరిశుభ్రతపై అవసరమైన సలహాలు, సూచనలు అందజేశారు. మాకు నిరంతర సహకారం అందిస్తోన్న ఆంధ్రా హాస్పిటల్స్ టీమ్‌కి ధన్యవాదాలు తెలుపు తున్నాం’ అంటూ ఎంబీ ఫౌండేషన్ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ నకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

వైద్య శిబిరంలో పాల్గొన్న విద్యార్థులు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here