Maharaja OTT: అఫీషియల్.. ఓటీటీలో విజయ్ సేతుపతి 100 కోట్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

0
23
అఫీషియల్.. ఓటీటీలో విజయ్ సేతుపతి 100 కోట్ల సినిమా..ఎప్పటినుంచంటే?

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన తాజా చిత్రం మహారాజ. ఎలాంటి అంచనాలు లేకుండా జూన్ 14న తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. కేవలం మౌత్ టాక్ తోనే ఏకంగా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. కేవలం తమిళ్ లోనే కాదు తెలుగు నాట మహారాజ సినిమాకు కలెక్షన్ల వర్షం కురిసింది. ఇప్పటికీ చాలా చోట్ల థియేటర్లలో సందడి చేస్తోన్న మహారాజ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ పామ్ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో స్ట్రీమింగ్ డేట్ కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది. జులై 12 నుంచి మహారాజ సినిమా ఓటీటీలోకి రానుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ అదే రోజు స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది నెట్ ఫ్లిక్స్.

కాగా మహారాజ సినిమా విజయ్ సేతుపతి కెరీర్ లో 50వ సినిమా. నితిల‌న్ సామినాథ‌న్ తెరకెక్కించిన ఈ రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ లో బాలీవుడ్ నటుడు, డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ప్రతినాయకుడిగా నటించాడు. మమతా మోహన్ దాస్, అభిరామి, భారతి రాజా ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో నటించారు. విరూపాక్ష, కాంతార, మంగళవారం వంటి సినిమాలకు సంగీతం అందించిన అజనీష్ లోక్ నాథ్ మహారాజ సినిమాకు స్వరాలు సమకూర్చడం విశేసం. మరి థియేటర్లలో విజయ్ సేతుపతి సినిమాను మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

ఇవి కూడా చదవండి

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here