Maharaja: గుడ్ న్యూస్ OTTలోకి వచ్చేస్తోన్న మహరాజా…

0
30
Maharaja: గుడ్ న్యూస్ OTTలోకి వచ్చేస్తోన్న మహరాజా...

హీరోనా.. క్యారెక్టరా అనేది చూడకుండా.. కేవలం కథను.. కంటెంట్‌ను నమ్మి.. సినిమాలు చేసుకుంటూ పోతున్న మక్కల్ సెల్వన్ విజయ్‌ సేతుపతి.. ఇప్పుడు ఓటీటీలో రాబోతున్నాడు. తన రీసెంట్ హిట్ మహరాజా ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అవడంతో.. ఆ న్యూస్‌తో ఇప్పుడు సోషల్ మీడియాలో బజ్ చేస్తున్నాడు. ఇక విజయ్ సేతుపతి హీరోగా నితిలన్ సామినాథన్ డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ మహరాజా..! రీసెంట్‌గా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్టైన ఈ మూవీ.. త్వరలో ఓటీటీలోకి రాబోతోంది అంటూ.. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. కానీ ఈ మూవీ టీం నుంచి కానీ.. ఏ ఓటీటీ సంస్థ నుంచి కానీ అఫీషియల్ న్యూస్‌ మాత్రం బయటికిరాకుండా ఉంది. అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఓ అఫీషియల్ న్యూస్ బయటికి వచ్చింది. ఇక అకార్డింగ్ టూ ఆ న్యూస్… మహారాజా చిత్రం ఈ నెల 19న నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ కానుందనే న్యూస్ ఈ మూవీ మేకర్స్ నుంచి బయటికి వచ్చింది. ఇదే న్యూస్ ఇప్పుడు మక్కల్ సెల్వన్ అభిమానులను ఖుషీ అయ్యేలా చేస్తూ.. ఈ మూవీ కోసం వారిని ఈగర్‌గా వెయిట్ చేసేలా చేస్తోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: ప్రభాస్ పేరుతో మోసం..అవి అస్సలు నమ్మకండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here