Maanas Nagulapalli: ‘బేబీ నాగులపల్లి వస్తున్నాడు’.. శుభవార్త చెప్పిన ‘బ్రహ్మముడి’ మానస్.. భార్య సీమంతం వీడియో

0
25
Maanas Nagulapalli: 'బేబీ నాగులపల్లి వస్తున్నాడు'.. శుభవార్త చెప్పిన 'బ్రహ్మముడి' మానస్.. భార్య సీమంతం వీడియో

బిగ్ బాస్ ఫేమ్, ప్రముఖ బుల్లితెర నటుడు మానస్ నాగుల పల్లి శుభ వార్త చెప్పాడు. త్వరలో తాను తండ్రిగా ప్రమోషన్ పొందనున్నట్లు వెల్లడించాడు. ఈ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా మానస్ తెలిపాడు. ఈ సందర్భంగా గర్భంతో ఉన్న తన భార్య శ్రీజ బేబీ బంప్ ఫొటోను కూడా అందులో షేర్ చేశాడు. మాది పెద్దలు కుదిర్చిప వివాహమే అయినా మ మనసులు పర్ ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి. ఇప్పుడు మా ఫ్యామిలీలోకి ఓ బుజ్జాయి రాబోతున్నందుకు ఎంతో సంతోషంగా. బేబీ నాగుల పల్లి వచ్చేస్తున్నాడు’ అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చాడు మానస్. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పలువురు బుల్లితెర సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు మానస్-శ్రీజ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా వారం రోజుల క్రితమే శ్రీజకు గ్రాండ్ గా సీమంతం కూడా నిర్వహించారు మానస్ కుటుంబ సభ్యులు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను కూడా మానస్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ఇవి కూడా చదవండి

కాగా గతేడాది నవంబర్ లో మానస్-శ్రీజల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. కాగా శ్రీజను పెళ్లి చేసుకున్న తర్వాత మానస్ జీవితం బాగా మారిపోయింది. బ్రహ్మముడి సీరియల్ రూపంలో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. కారు కూడా కొన్నాడు. ఇప్పుడు పండంటి బిడ్డను తన జీవితంలోకి ఆహ్వానిస్తున్నాడీ హ్యాండ్సమ్ యాక్టర్.

కాగా కెరీర్ ప్రారంభంలో య్‌ రాజా కాయ్‌, ప్రేమికుడు తదితర చిత్రాల్లో హీరోగా నటించాడు మానస్. అలాగే కొన్ని మూవీస్ లో స్పెషల్ రోల్స్ కూడా పోషించాడు. ఇదే క్రేజ్ తో తెలుగు బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో అడుగుపెట్టాడు.తన ఆటతీరు, మాటతీరుతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. టాప్‌ 5 ఫైనలిస్టుల్లో ఒకరిగా నిలిచాడు.

ఇక బుల్లితెరపై బీభత్సమైన టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతోన్న బ్రహ్మముడి సీరియల్ తో మానస్ బుల్లితెర ప్రేక్షకులకు బాగా చేరువై పోయాడు. ప్రస్తుతం ఈ సీరియల్ తో పాటు కొన్ని టీవీ రియాలిటీషోలతోనూ మానస్ బిజీబిజీగా ఉంటున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here