లిమిట్స్ దాటిన ట్రోలర్స్‌ను టార్గెట్ చేసింది మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్. సినిమా వాళ్ల మీద డార్క్ కామెడీ చేస్తున్న ట్రోలర్స్ తాట తీయడమే లక్ష్యంగా పెట్టుకుంది. నటీనటులపై అసభ్యంగా దుష్రచారం చేస్తున్న 200 యూట్యూబ్ ఛానెల్స్‌ను గుర్తించి… డీజీపీకి కంప్లైంట్ చేసింది. 200 ఛానెళ్లకి సంబంధించిన వివరాలను డీజీపీకి రిపోర్ట్ చేశారు మూవీ అసోసియేషన్ ప్రతినిధులు. ఇప్పటికే 25 చానెళ్లను యూట్యూబ్ సాయంతో డిలీట్ చేయించిన అసోసియేషన్… అసభ్యకర వీడియోలు తొలగించకపోతే మిగతా ఛానెల్స్‌ను షట్ చేయిస్తామంటూ వార్నింగ్ ఇస్తోంది. ఇక ట్రోల్స్‌కి సంబంధించి సైబర్ క్రైమ్‌లో వింగ్ ఏర్పాటు చేస్తామన్నారు డీజీపీ. ఇటు పోలీసులతో సమన్వయం కోసం మూవీ అసోసియేషన్ కూడా ఓ కమిటీని ఏర్పాటు చేస్తామంటోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.