Thursday, December 26, 2024
Google search engine
HomeUncategorizedLakshmi Manchu: దయచేసి నాకు సాయం చేయండి.. కూతురి కోసం మంచు లక్ష్మీ పోస్ట్

Lakshmi Manchu: దయచేసి నాకు సాయం చేయండి.. కూతురి కోసం మంచు లక్ష్మీ పోస్ట్

Lakshmi Manchu: దయచేసి నాకు సాయం చేయండి.. కూతురి కోసం మంచు లక్ష్మీ పోస్ట్

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఫ్యామిలీ నుంచి ఇద్దరు హీరోలు, ఓ నటి ఇండస్ట్రీకి వచ్చిన విషయం తెలిసిందే. మంచు విష్ణు, మంచు మనోజ్ హీరోలుగా దూసుకుపోతున్నారు. కాగా మంచు లక్ష్మీ నటిగా, నిర్మాతగా, యాంకర్ గా తన ప్రతిభను చాటుకున్నారు. సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది మంచు లక్ష్మీ. అలాగే నిర్మాతగాను మంచి సినిమాలను అందించారు మంచు లక్ష్మీ. అలాగే పలు టాక్ షోలకు హోస్ట్ గాను వ్యవహరించారు మంచు లక్ష్మీ ఈమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక సోషల్ మీడియాలో మంచు లక్ష్మీ చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది మంచు లక్ష్మీ. అలాగే సమాజంలో జరిగే పలు సంఘటనల పై స్పందిస్తూ ఉంటారు.

ఇదిలా ఉంటే తాజాగా మంచు లక్ష్మీ షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తన కూతురి గురించి ఓ పోస్ట్ షేర్ చేసింది మంచు లక్ష్మీ. తన కూతురి కోసం అమెరికా వెళ్లేందుకు సాయం చేయాలనీ కోరింది మంచు లక్ష్మీ. నా అమెరికా వీసా ఒక నెల క్రితమే అప్రూవ్ అయ్యింది. కానీ ఇప్పటి వరకు అది నాకు రాలేదు. నా కూతురు స్కూల్ కి ఇచ్చిన సెలవలు అయిపోయాయి. నేను జూన్ 12న అమెరికాకు వెళ్ళాలి. కానీ నాకు వీసా ఇంకా రాలేదు. ఎంబసీ వెబ్‌సైట్ డౌన్ కావడంతో.. నేను వాళ్ళను కాంటాక్ట్ చేయలేకపోతున్నాను. ఇప్పటికే రెండు నెలలు దాటింది. దయచేసి ఎవరైనా స్పందించి నాకు సహాయం చేయండి “అంటూ రాసుకొచ్చింది.

మంచు లక్ష్మీ షేర్ చేసిన పోస్ట్ లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ పోస్ట్ పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇక రీసెంట్ గా మంచు లక్ష్మీ వరలక్ష్మీ శరత్ కుమార్ పెళ్ళికి హాజరయ్యింది. అక్కడ తన ఫ్రెండ్స్ తో కలిసి సందడి చేసింది లక్ష్మీ. కాగా మంచు లక్ష్మీ సినిమాల విషయానికొస్తే ఇటీవలే యక్షిణి అనే వెబ్ సిరీస్ లో కనిపించింది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్ని హాట్ స్టార్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది.  అలాగే ఆదిపర్వం అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments