Lady Producer: టాలీవుడ్‌లో దారుణం.. కుళ్లిన స్థితిలో లేడీ ప్రొడ్యూసర్ శవం.!

0
21
టాలీవుడ్‌లో దారుణం.. కుళ్లిన స్థితిలో లేడీ ప్రొడ్యూసర్ శవం.!

ఓ లేడీ… ఫిల్మ్ ఇండస్ట్రీకొచ్చి రాణిస్తున్నారంటేనే.. ఆమె ధైర్యవంతురాలయ్యే ఉంటుంది. మరి ఇప్పుడా ధైర్యమే పోయిందో.. లేక ఎవరికీ చెప్పుకోని కష్టమే వచ్చిందో.. లేక మరేదైనా కారణమే ఉందో.. తెలీదు కానీ.. టాలీవుడ్‌లో ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా రాణిస్తున్న స్వప్న వర్మ.. సూసైడ్ చేసుకొన్నారు. కుళ్లిన స్థితిలో తన ఇంట్లోనే శవమై కనిపించి.. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యారు. ఇక ప్రొడ్యూసర్‌గా.. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా మగాళ్లు మాత్రమే రాణిస్తున్న ఇండస్ట్రీలో.. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నా స్వప్న వర్మ. సొంతూరు రాజమండ్రి నుంచి హైద్రాబాద్‌కు వచ్చి.. దాదాపు మూడు సంవత్సరాలుగా ఇండస్ట్రీలో పని చేస్తున్నారు. 6 నెలలుగా ఏ ప్రాజెక్ట్ లేకపోవడంతో.. ఇంట్లోనే ఉంటున్నారు. ఇక ఈ క్రమంలోనే మాదాపూర్ కావూరి హిల్స్‌లో ఉన్న తన ఇంట్లో విగతజీవిగా కనిపించారు.

స్వప్న వర్మ ఇంట్లో నుంచి చెడు వాసన వస్తుండడంతో.. ఆమె ఇంటి పక్కనే ఉన్న వారు.. డోర్ తెరచి చూసి షాకయ్యారు. తన బెడ్‌రూమ్లో ఫ్యాన్‌కు వేలాడుతున్న ఆమె డెడ్ బాడీని చూసి భయపడ్డారు. పోలీసులకు ఇన్ఫర్మేషన్‌ ఇచ్చారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు ఆమె డెడ్‌ బాడీని ప్రిల్మినరీ ఎగ్జాజ్ చేసి.. రెండు రోజుల క్రితం సూసైడ్ చేసుకుని ఉండొచ్చంటూ అంచనా వేశారు. ఆమె డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు దర్యాపు చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here