Thursday, December 26, 2024
Google search engine
HomeUncategorizedKerintha: కేక పెట్టించిన కేరింత భామ.. ఇప్పుడు చూస్తే స్టార్ హీరోయిన్స్ కూడా కుళ్లుకోవాల్సిందే

Kerintha: కేక పెట్టించిన కేరింత భామ.. ఇప్పుడు చూస్తే స్టార్ హీరోయిన్స్ కూడా కుళ్లుకోవాల్సిందే

ఇండస్ట్రీలో చాలా సినిమాలు ప్రేక్షకులను మెప్పించి మంచి మార్కులు కొట్టేశాయి. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా కంటెంట్ కనెక్ట్ అయితే చాలు ప్రేక్షకులు ఆ సినిమాను సూపర్ హిట్ చేస్తున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు కూడా మంచి విజయాలను దక్కించుకుంటున్నాయి. ఇక చాలా సినిమాలు యువతను ఆకట్టుకునే కథలతో తెరకెక్కి సూపర్ హిట్స్ గా నిలుస్తున్నాయి. అలాంటి సినిమాల్లో కేరింత సినిమా ఒకటి. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు కేరింత సినిమాను తెరకెక్కించారు. సాయికిరణ్ అడవి  దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమంత్ అశ్విన్, విశ్వంత్ దుడ్డుంపూడి, పార్వతీశం, శ్రీదివ్య, సుకృతి అంబటి, తేజస్వి మదివాడ  ప్రధానపాత్రల్లో నటించారు.

ఇది కూడా చదవండి :Nandamuri Mokshagna: ఇదెక్కడి మాస్ రా మావా..!! నందమూరి మోక్షజ్ఞకు జోడీగా కుర్రాళ్ళ ఫెవరెట్ హీరోయిన్

యువతీ యువకుల మధ్య ఉండే ప్రేమ, స్నేహం ఈ సినిమాలో చక్కగా చూపించాడు దర్శకుడు. అలాగే ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం ప్రేక్షకులను అలరించింది. సాయికిరణ్ ఇంతకుముందు తీసిన వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు సినిమాలతో సెన్సిబుల్ దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాను కూడా మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కించాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నటించిన చాలా మంది మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే ఈ సినిమాలో పార్వతీశంకు జోడీగా నటించిన హీరోయిన్ గుర్తుందా.? ఆమె పేరు సుకృతి అంబటి.

ఇది కూడా చదవండి: Sai Pallavi: పదేళ్లుగా అతనితో రిలేషన్‌లో ఉన్నా.. అసలు విషయం చెప్పి షాక్ ఇచ్చిన సాయి పల్లవి

కేరింత సినిమా తర్వాత ఆమె పెద్దగా కనిపించలేదు. పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ లోకి అడుగుపెట్టింది. కేరింత సినిమాలో భావన అనే పాత్రలో చక్కగా నటించి మెప్పించింది ఈ అమ్మడు. కాగా చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో తండ్రి పెంపకంలోనే పెరిగిన సుకృతి.. ఢిల్లీలోని కులచి హన్స్ రాజ్ స్కూల్లో చదువుకుంది. రాజస్థాన్‌లోని బనస్థలి యూనివర్సిటీలో ఇంజినీరింగ్ పూర్తి చేసింది. సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

సుకృతి అంబటి సోషల్ మీడియా పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments