Keerthy Suresh: గ్లామర్ గేట్లు ఎత్తేస్తున్న కీర్తి సురేష్.. అందుకోసమే అంటూ వినిపిస్తున్న గుసగుసలు

0
33
గ్లామర్ గేట్లు ఎత్తేస్తున్న కీర్తి సురేష్..

కీర్తి సురేష్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చేసింది తక్కువ సినిమాలే అయిన మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. నేను శైలజ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన కీర్తిసురేష్ తొలి సినిమాతోనే మంచి క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది.ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాల్లో బిజీగా ఉంది. కాగా ఎప్పుడూ సంప్రదాయ దుస్తులను ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది ఈ ముద్దుగుమ్మ. సినిమాల్లో కూడా ఎక్కడా బోల్డ్ రోల్స్ ఎంచుకోలేదు ఈ అమ్మడు. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో కీర్తి సురేష్ గ్లామర్ గేట్లు ఎత్తేస్తుంది.

ఇది కూడా చదవండి : Bigg Boss Telugu 8: బిగ్ బాస్ 8లో ఊహించని ఎంట్రీ.. హౌస్‌లో అడుగుపెట్టనున్న హాట్ బ్యూటీ..!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమాలో కాస్త గ్లామరస్ గా కనిపించింది ఈ అమ్మడు. ఇక ఇప్పుడు పూర్తిగా గ్లామర్ అవతార్‌లో మెరుస్తోంది. రీసెంట్ డేస్ లో ఆమె డ్రస్సింగ్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అయితే కీర్తిసురేష్ ఇప్పుడు బాలీవుడ్‌లోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతుంది. హిందీ చిత్ర పరిశ్రమ గాలికి ఆమె ఇంతలా మారిపోయారా అనే ప్రశ్న తలెత్తుతోంది. బాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్స్ గ్లామర్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. రొమాంటిక్ సీన్స్ లో నటించడానికి, బోల్డ్ గా కనిపించడానికి అస్సలు మొహమాటపడరు. ఇక కీర్తి కూడా ఇప్పుడు గ్లామరస్ గా కనిపిస్తుండటంతో హిందీలో నెట్టుకురావాలంటే ఆ మాత్రం ఉండాలి అని నెటిజన్స్ గుసగుసలాడుకుంటున్నారు.

ఇది కూడా చదవండి : 13మందితో ఎఫైర్స్.. ఇప్పటికీ సింగిల్‌గానే.. ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా..!

రీసెంట్ గా తమిళ సినిమా వన్ ఆడియో లాంచ్ ఈవెంట్‌లో కీర్తి సురేష్ కనిపించింది. ఈ ఈవెంట్ లో గ్లామరస్ గా కనిపించింది ఈ చిన్నది. చీర కట్టుకున్నా కూడా తన అందంతో ఆకట్టుకుంది. దాంతో ఆమె లుక్ అందరినీ ఆకర్షిస్తోంది. నటనకు ప్రాధాన్యమున్న, సంప్రదాయ పాత్రలు చేసిన ఈ బ్యూటీ ఇంతలా ఎలా ఇంతలా మారిపోయిందేంటీ అని అంతా షాక్ అవుతున్నారు. ఇక హిందీలో కీర్తి సురేష్ ‘బేబీ జాన్’ సినిమాలో నటిస్తోంది. ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తమిళ సినిమా ‘తేరి’కి రీమేక్. వరుణ్ ధావన్ హీరోగా చేస్తున్నాడు. వరుణ్‌కి జోడీగా కీర్తి సురేష్ నటిస్తుంది. హిందీలో తొలి సినిమా హిట్ అయితే భవిష్యత్తులో ఎన్నో ఆఫర్లు వస్తాయి. అందుకు ఉదాహరణ రష్మిక మందన్న.. ఈ అమ్మడు ఇప్పుడు నార్త్ లో బిజీగా ఉంది. ఆమెకు ఇప్పుడు బాలీవుడ్‌లో డిమాండ్ పెరిగింది. అదేవిధంగా కీర్తి సురేష్ భవిష్యత్తులో హిందీ చిత్రసీమలో బిజీ అవుతుందో లేదో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here