Katrina Kaif: కత్రినా కైఫ్ తల్లి కాబోతుందా..? భార్య ప్రెగ్నెన్సీపై విక్కీ కౌశల్ ఏమన్నారంటే..

0
38
కత్రినా కైఫ్ ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించిన విక్కీ కౌశల్..

బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ప్రస్తుతం బ్యాడ్ న్యూస్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో యానిమల్ మూవీ హీరోయిన్ త్రిప్తి డిమ్రి కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అయిన ఈ సినిమా జూలై 19న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్‌లో బిజీగా చిత్రయూనిట్. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ ప్రమోషనల్ ఈవెంట్‌లో కత్రినా ప్రెగ్నెన్సీ గురించి విక్కీని ప్రశ్నించగా.. ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. కొన్నాళ్లుగా తన భార్య కత్రినా కైఫ్ గురించి.. ప్రెగ్నెన్సీ గురించి వస్తున్న రూమర్స్ అన్ని అవాస్తవమని.. వాటిలో ఎలాంటి నిజం లేదన్నారు. కత్రినా గర్భం దాల్చిందనే పుకార్లు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. దీని గురించి విక్కీ మాట్లాడుతూ.. ఎప్పుడు ఏ విషయం జరిగినా సంతోషంగా ప్రకటిస్తానని చెప్పాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదన్నారు. అలాగే తన సినిమా ‘బ్యాడ్ న్యూస్’ని అందరూ చూడాలని కోరారు.

ఎప్పుడైనా శుభవార్త తెలియజేస్తానని చెప్పారు. జూలై 16న కత్రినా పుట్టినరోజు. విక్కీ పుట్టినరోజు ప్రణాళికల గురించి కూడా మాట్లాడాడు. ఇది చాలా ప్రత్యేకమైన రోజు అని, ఈ ప్రత్యేకమైన రోజున తన భార్యతో కలిసి నాణ్యమైన సమయాన్ని గడపడమే తమ ప్రణాళిక అని చెప్పారు. కొన్నిరోజులుగా సినిమా షూటింగ్స్, ప్రమోషన్స్ అంటూ బిజీగా ఉన్నానని.. కత్రినా పుట్టినరోజు తనతో కలిసి ఉండాలనుకుంటున్నట్లు తెలిపారు. ఇటీవల జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి వేడుకలలో వీరిద్దరు కలిసి పాల్గొన్నారు.

ఇక బ్యాడ్ న్యూస్ సినిమా విషయానికి వస్తే.. 2019లో విడుదలైన ‘గుడ్‌న్యూస్‌’ చిత్రానికి ఇది సీక్వెల్‌. ఆనంద్ తివారీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మించారు. విక్కీ చివరిసారిగా షారుక్ ఖాన్ ‘డింకీ’లో కనిపించాడు. రజత్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 2023లో విడుదలైంది. ఈ చిత్రంలో విక్కీ అతిధి పాత్రలో కనిపించాడు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 454 కోట్ల రూపాయల వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద హిట్ అయింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here