Friday, December 27, 2024
Google search engine
HomeUncategorizedKartikeya: ప్రణీత్ హనుమంతుకు ఇంటర్వ్యూ ఇచ్చిన హీరో కార్తికేయ.. ఇప్పుడు ఏమంటున్నాడంటే?

Kartikeya: ప్రణీత్ హనుమంతుకు ఇంటర్వ్యూ ఇచ్చిన హీరో కార్తికేయ.. ఇప్పుడు ఏమంటున్నాడంటే?

పిల్లలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ప్రముఖ యూట్యూర్ ప్రణీత్ హనుమంతు, కంటెంట్ క్రియేటర్, నటుడు ప్రణీత్ హనుమంతుపై సర్వత్రా విమర్శల వర్షం కురుస్తోంది. వావి వరసలు మర్చి తండ్రీ కూతుళ్ల అనుబంధంపై అతను చేసిన వ్యాఖ్యలను సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఖండిస్తున్నారు. కాగా ప్రణీత్ హనుమంతు గతంలో కొన్ని సినిమాల్లో నటించాడు. అలాగే కంటెంట్ క్రియెటర్ గా కొందరు స్టార్స్ ను ఇంటర్వ్యూ చేశాడు. ఈ క్రమంలో ప్రముఖ యంగ్ హీరో కార్తికేయ కూడా తన భజే వాయువేగం సినిమా కోసం ప్రణీత్ హనుమంతుకు చెందిన ఫన్మంతు అనే యూట్యూబ్ ఛానెల్‍కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో హనుమంతుతో పాటు అతని స్నేహితులు కూడా ఉన్నారు. అయితే దీనిపై స్పందిచిన హీరో కార్తికేయ తాను ప్రణీత్ హనుమంతుకు ఇంటర్వ్యూ ఇవ్వకుండా ఇవ్వాల్సిందన్నాడు. ఈమేరకు ట్వీట్ చేశాడీ ట్యాలెంటెడ్ హీరో.

అప్పుడే గొడవేసుకుందామనుకున్నా.. కానీ..

‘నేను ప్రణీత్ హనుమంతు యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాను. అయితే అది కేవలం నా భజే వాయు వేగం సినిమా ప్రమోషషన్లలో భాగమే. ఇతర ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చినట్టే వాళ్లకు ఇచ్చాను. అయితే అక్కడ వాళ్లు అడిగిన కొన్ని ప్రశ్నలు నాకు కాస్త షాకింగ్‍గా అనిపించాయి. కానీ అక్కడ గొడవలు వద్దనుకొని నేను అనుకున్నా. అందుకే వీలైనంత వరకు స్పోర్టివ్‍గా ఉండాలనుకున్నానేను అతనికి ఇంటర్వ్యూ ఇవ్వాల్సింది కాదు. అయితే హీరోగా నా సినిమా ను జనాల్లోకి తీసుకెళ్లే బాధ్యతల్లో భాగంగానే ఇంటర్వ్యూలు ఇచ్చాను. అయితే అలాంటి కంటెంట్‍ను ఎంకరేజ్ చేయడం నా ఉద్దేశం మాత్రం కాదు. కానీ నేను అందులో భాగమైనందుకు చాలా బాధగా ఫీలవుతున్నా. ఇప్పటి నుంచి నేను ఇంటర్వ్యూల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటా. మనం అలాంటి కంటెంట్‍ను ఎంకరేజ్ చేయకూడదు. అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా’ అని ట్వీట్ లో రాసుకొచ్చారు కార్తికేయ.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments