Karan Johar: మూడు కోట్లు వసూలు చేయని హీరో రూ.30 కోట్లు అడుగుతున్నారు.. కరణ్ జోహార్ షాకింగ్ కామెంట్స్..

0
27
Karan Johar: మూడు కోట్లు వసూలు చేయని హీరో రూ.30 కోట్లు అడుగుతున్నారు.. కరణ్ జోహార్ షాకింగ్ కామెంట్స్..

Karan Johar: మూడు కోట్లు వసూలు చేయని హీరో రూ.30 కోట్లు అడుగుతున్నారు.. కరణ్ జోహార్ షాకింగ్ కామెంట్స్..

ఇటీవల బాలీవుడ్‌లో నటీనటులు, నిర్మాణ సంస్థల మధ్య గొడవలు మొదలైన సంగతి తెలిసిందే. కొందరు నటీనటుల వల్లే సినిమా నిర్మాణ వ్యయం పెరిగిపోయిందని, సినిమా బడ్జెట్ తగ్గించాలంటూ నిర్మాతల మండలి సమావేశం నిర్వహించి పలు విషయాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. కొందరు నటీనటులు, టాలెంట్ ఏజెన్సీలకు లేఖలు రాసి షరతులు విధించారని నిర్మాతలు ఆరోపించారు. నార్త్ ఇండస్ట్రీలోని కొందరు పెద్ద నటుల సినిమాల బడ్జెట్ పెరిగిపోతుంది. దీంతో నిర్మాతలకు సినిమా నిర్మాణం భారంగా మారుతుంది.. కానీ నటీనటులు తమ పారితోషికాన్ని ఏమాత్రం తగ్గించుకోవడం లేదని పలువురు ప్రొడ్యూసర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై గత ఏడాదికాలంగా నిర్మాత, దర్శకుడు, నటుడు కరణ్ జోహార్ కీలక వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.

ఒకట్రెండు సినిమాలు చేసిన వారు కూడా తమ తదుపరి సినిమాకు కోటి రూపాయలు అడుగుతున్నారని కరణ్ జోహార్ మొదటి నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ కారణంగానే కొందరు నటీనటులు కూడా తమ సినిమాల నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు ఇదే విషయంపై మరోసారి కరణ్ జోహార్ మాట్లాడుతూ, ‘సినిమాల కథ విషయంలో ప్రేక్షకుల అభిరుచులు చాలా మారిపోయాయి. వారికి భిన్నమైన సినిమా కావాలి. కానీ సినిమా ప్రొడ్యూసర్‌గా తీయాలనుకున్నా మీ సినిమా ఏ,బీ,సీ సెంటర్లలో పర్ఫామెన్స్ చేయదు. కేవలం మల్టీప్లెక్స్‌లలోనే సినిమా నడిస్తే సరిపోదు’’ అన్నారు.

దీంతో పాటు సినిమా నిర్మాణ వ్యయం కూడా పెరిగింది. హిందీ చిత్ర పరిశ్రమలో దాదాపు 10 మంది ప్రతిభావంతులైన నటులు ఉన్నారు. వారందరికీ భారీ మొత్తంలో పారితోషికం ఇవ్వాల్సి వస్తుంది. ఆ నటీనటులకు రెమ్యూనరేషన్ చెల్లించి, ఆ తర్వాత సినిమా నిర్మాణానికి డబ్బు చెల్లించి, ఆ తర్వాత సినిమా ప్రమోషన్ కోసం ఖర్చు పెట్టాలి. ఇక సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో హిట్ కాకపోవడమే కాకుండా అనుకున్నంత వసూళ్లు రాబట్టలేదు. 35 కోట్లు అడుగుతున్న నటీనటుల సినిమాలు తొలిరోజు 3.5 కోట్లు కూడా వసూలు చేయడం లేదు’ అని అన్నారు. ‘సినిమా నిర్మాణంలో లెక్కలు అర్థంకాదు. కొన్ని ఖర్చులను ఎలా నియంత్రించాలి అనేది తెలియదు..? అయినా మేము నిర్మాతలుగా సినిమాలు చేస్తూనే ఉండాలి. ప్రొడక్షన్ విషయాల గురించి చర్చిస్తూనే ఉండాలి. ఈ సినిమా తీయడం వెనుక చాలా డ్రామా ఉంది. సినిమా కథాంశం అంతకు మించి ఉంటుంది’’ అని కరణ్ జోహార్ అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here