Kalki 2898 AD Box Office Collections: బాక్సాఫీస్ వద్ద కల్కి ఊచకోత.. 9 రోజుల్లో ఎంత కలెక్షన్స్ వచ్చాయంటే..

0
29
బాక్సాఫీస్ వద్ద కల్కి ఊచకోత..

“టిప్పర్ లారీ వెళ్లి స్కూటర్ ని గుద్దితే ఎలా ఉంటదో తెలుసా ?”.. రెబల్ స్టార్ ప్రభాస్ బాక్సాఫీస్ వార్‏కి దిగితే ఇదిలా అలాగే ఉంటుంది మరి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘కల్కి 2898 AD’ బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. వరల్డ్ వైడ్ ఈ మూవీ కలెక్షన్ల సునామీ చూస్తుంటే.. ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్-5 చిత్రాలలో ఒకటిగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం ‘కల్కి’ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర ఎదురే లేదన్నట్టుగా ఉంది. మొదటి రోజే సినిమాకి పాజిటివ్ టాక్ రావడం, ఇతర సినిమాల నుంచి పోటీ లేకపోవడంతో.. పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. ‘కల్కి’ మూవీ వారం రోజుల్లోనే ‘బాహుబలి’ లైఫ్ టైం కలెక్షన్స్ ని దాటేసింది. ‘బాహుబలి-1′ ఫుల్ రన్ లో రూ.600 కోట్ల గ్రాస్ రాబట్టగా.. కల్కి’ కేవలం ఆరు రోజుల్లోనే ఈ ఫీట్ సాధించి, టాలీవుడ్ హిస్టరీలో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన నాలుగో సినిమాగా నిలిచింది. ఇక ఇప్పుడు రూ.800 కోట్లకు పైగా వసూల్లు రాబట్టింది. ఈ సినిమా రెండో శుక్రవారం అంటే నిన్నటికి రూ.19.7 కోట్లు కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

నిన్న ఒక్కరోజే కల్కి సినిమాకు తెలుగు నుంచి రూ.5.4 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే తమిళం, మలయాళం, కన్నడ, భాషల నుంచి భారీగానే కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. విడుదలైన 9 రోజుల్లోనే ఇండియాలో రూ.431.55 కోట్లు వసూలు చేసినట్లు గణాంకాలు చెబుతున్నారు. ఇందులో తెలుగులో 24.1 కోట్లు, హిందీ నుంచి రూ.171.9 కోట్లు, కన్నడ నుంచి 3 కోట్లు, మలయాళం నుంచి 14.9 కోట్లుగా ఉన్నాయి. మొత్తం ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది రోజుల కలెక్షన్స్ రూ.800 కోట్లు వచ్చినట్లుగా చిత్రయూనిట్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇక ఆ తరువాతి టార్గెట్ రూ.1300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి, రెండో స్థానంలో ఉన్న ‘ఆర్ఆర్ఆర్’ అవుతుంది.

దీనిని కూడా దాటేయడం ‘కల్కి’కి పెద్ద కష్టమేమి కాదు. ప్రస్తుతం ‘కల్కి’ జోరు చూస్తుంటే.. రెండు వారాలు పూర్తయ్యే సరికి రూ.1000 కోట్ల క్లబ్ లో చేరే అవకాశముంది. ఇక శని, ఆదివారాలు వీకెండ్స్ లో కల్కి కలెక్షన్స్ మరింత పెరగనున్నాయి. ఆ దెబ్బకి.. మూడు వారాల్లోనే ‘ఆర్ఆర్ఆర్’ లైఫ్ టైం కలెక్షన్స్ ని ‘కల్కి’ దాటే అవకాశముంది. అదే జరిగితే, తెలుగు సినిమాల పరంగా రూ.1800 కోట్ల గ్రాస్ తో ‘బాహుబలి-2’ టాప్ లో ఉండగా.. రూ.1400 కోట్లకు పైగా గ్రాస్ తో ‘కల్కి’ సెకండ్ ప్లేస్ లోకి వస్తుంది. ఇక ఇండియన్ సినిమాల పరంగా చూస్తే.. మొదటి రెండు స్థానాల్లో ‘దంగల్’, ‘బాహుబలి-2’ ఉండగా.. ‘కల్కి’ మూడో స్థానంలో నిలుస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here