Kalki 2898 AD: ‘కల్కి’సినిమాలో దీపిక పాత్రను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. అసలు సెట్ అయ్యేది కాదేమో

0
22
Kalki 2898 AD: 'కల్కి'సినిమాలో దీపిక పాత్రను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. అసలు సెట్ అయ్యేది కాదేమో

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద కనీవినీ ఎరగని కలెక్షన్లు సాధిస్తోంది. ఇప్పటికే రూ. 800 కోట్లకు పైబడి వసూళ్లు సాధించిన కల్కి త్వరలోనే రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమంటున్నారు ట్రేడ్ నిపుణులు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సుమారు రూ. 600 కోట్ల బడ్జెట్ తో కల్కి సినిమాను నిర్మించారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించింది. అలాగే బిగ్ బీ అమితాబ్ బచ్చన్, లోక నాయకుడు కమల్ హాసన్, దిశా పటానీ, శోభన, రాజేంద్ర ప్రసాద్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అయితే కల్కి సినిమా మొత్తం దీపిక పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఇందులో ఆమె సుమతి అనే పాత్రలో మెరిసింది. ప్రస్తుతం నిండు గర్భంతో ఉన్న దీపిక సినిమాలోనూ గర్భిణీ పాత్రలో అద్భుతంగా నటించిందని విమర్శకుల ప్రశంసలు వస్తున్నాయి. ఈ సినిమాతో దీపిక నటిగా మరో మెట్టు పైకెక్కినట్టేనని కాంప్లిమెంట్లు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే కల్కి సినిమాలో సుమతి పాత్ర కోసం దీపిక బదులు ముందుగా టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డేను అనుకున్నారట మేకర్స్. అంతకు ముందే ప్రభాస్, పూజా హెగ్డేల కాంబినేషన్ లో రాధే శ్యామ్ అనే పాన్ ఇండియా మూవీ వచ్చింది. దీంతో మరోసారి ప్రభాస్ తో జత కట్టే అవకాశం పూజకు వచ్చిందట. అయితే రాధేశ్యామ్ డిజాస్టర్ కావడం, దీనికి తోడు పూజ నటనపై విమర్శలు రావడంతో మేకర్స్ వెనక్కు తగ్గారట. అలాగే గత కొన్నేళ్లుగా పూజ నటించిన సినిమాలన్నీ డిజాస్టర్లు కావడంతో కల్కి యూనిట్ తమ నిర్ణయాన్ని మార్చుకున్నారట. అలా పూజ ప్లేస్ లో దీపికా పదుకొణె వచ్చిందట. అయితే ఈ రూమర్లలో ఎంత వరకు నిజముందో తెలియదు కానీ, కల్కి మేకర్స్ మంచి నిర్ణయమే తీసుకున్నారంటున్నారు ఫ్యాన్స్. దీపిక పాత్ర పూజకు అసలు సెట్ అయ్యేది కాదంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here