Kalki 2898 AD: కల్కిలో కమాండర్ మానస్ పాత్రలో నటించిన ఈ నటుడి గురించి తెలుసా..? ఆయన కూతురి గురించి తెలిస్తే షాకే..

0
18
కల్కిలో కమాండర్ మానస్ కూతురి గురించి తెలుసా..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన కల్కి 2898 ఏడి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. భారీ తారాగణం, భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. జూన్ 27 న రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పటివరకు రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో నార్త్, సౌత్ సెలబ్రెటీస్ కీలకపాత్రలు పోషించారు. అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొణే, దిశా పటానీ, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, శోభన, మాళవిక నాయర్, రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి ఇలా చాలా మంది సినీతారలు ముఖ్య పాత్రలు పోషించారు. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు శాశ్వత ఛటర్జీ కమాండర్ మానస్ పాత్రలో కనిపించారు. 1997 నుంచి సినిమాల్లో చురుకుగా ఉన్న ఆయన.. 2012లో సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించిన కహానీ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. హిందీతోపాటు బెంగాలీలోనూ పలు సినిమాల్లో నటించారు.

హిందీ, బెంగాలీలో పలు చిత్రాల్లో నటించిన శాశ్వత ఛటర్జీ.. ఇప్పుడు కల్కి సినిమాతో ఇటు దక్షిణాది ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ కల్కి సినిమా స్టోరీ చెప్పినప్పుడు ఎలా రియాక్ట్ కావాలి అనేది అర్థం కాలేదని అన్నారు. ప్రస్తుతం శాశ్వత ఛటర్జీ వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు నెటిజన్స్. శశ్వత్ ఛటర్జీని ఇండస్ట్రీలో సజ్జన్ అని పిలుస్తారు. టాలీవుడ్‌లోనే కాకుండా ప్రస్తుతం బాలీవుడ్‌లో కూడా దూసుకుపోతున్నాడు. కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో జరిగే ఏ పార్టీలోనూ కనిపించడు. అలాగే తన పర్సనల్ లైఫ్ గురించి అంతగా తెలియనివ్వడు. ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఆయన గురించి ఎలాంటి గాసిప్‌లు లేవు. అతడికి భార్య భార్య మహువా చటోపాధ్యాయ, కూతురు హియా చటోపాధ్యాయ ఉన్నారు.

శశ్వత్ మహువాను ప్రేమ వివాహం చేసుకున్నాడు. కూతురు హియా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టలేదు. కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ సందడి చేస్తుంది. ప్రస్తుతం హియా సెయింట్ జేవియర్స్ కాలేజీలో చదువుతున్నట్లు సమాచారం. చదువుతోపాటు డాన్స్ లోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో తన డాన్స్ రీల్స్ షేర్ చేసింది. సినిమా ప్రపంచంతో హియాకు ఎలాంటి సంబంధం లేకపోయినా.. తన తండ్రితో కలిసి షూటింగ్స్ లో పాల్గొంటుంది. త్వరలోనే హియా చటోపాధ్యాయ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here