యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కళ్లతోనే నటించే నటుడు తారక్ అంటూ ఇప్పటికే చాలా మంది కొనియాడారు. తారక్ టాలీవుడ్ టాప్ హీరో నుంచి గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇరగదీశారు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతోంది. దేవర అనే పవర్ ఫుల్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను రెండు పార్ట్స్ గా తెరకెక్కిస్తున్నారు కొరటాల శివ.
ఇది కూడా చదవండి : నన్ను చూసి తట్టుకోలేవు.. నువ్వు రావొద్దు అన్నాడు.. కన్నీళ్లు పెట్టుకున్న బ్రహ్మానందం
ఈ సినిమాని ఈ ఏడాది సెప్టెంబర్ 27న విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నారు మేకర్స్. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దేవర సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. దీనితో పాటే బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో వార్ 2 చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఎన్టీఆర్ లైనప్ చేసిన సినిమాలు చూస్తూనే మైండ్ బ్లాక్ అవుతుంది. ఎన్టీఆర్ ఒక సినిమా షూటింగ్ లోనే ఉండగానే మరికొంతమంది దర్శకులకు ఓకే చేశాడు.
ఇదికూడా చదవండి : Rashmika Mandanna: నువ్వు లేవంటే నమ్మలేకపోతున్నా.. నిన్ను కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది.. రష్మిక ఎమోషనల్ పోస్ట్
దేవర షూటింగ్ మొదల పెట్టగానే ప్రశాంత్ నీల్ తో సినిమాను లైనప్ చేశాడు తారక్. ఆ మధ్య ఈ సినిమా ప్రీ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాతో పాటు దేవర పార్ట్ 2 సినిమా కూడా చేస్తున్నాడు. అలాగే శౌర్యువ్ తారక్ కి గ్రీన్ సింగల్ ఇచ్చాడని తెలుస్తోంది. శౌర్యువ్ ఇటీవలే హాయ్ నాన్న సినిమాతో హిట్ అందుకున్నాడు. అలాగే తరుణ్ భాస్కర్ కూడా ఎన్టీఆర్ కోసం ఓ సినిమా చేస్తున్నాడని తెలుస్తోంది. స్వామిరారా ఫేమ్ సుధీర్ వర్మతోనూ ఎన్టీఆర్ ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడని తెలుస్తోంది. కొరటాల శివ, ప్రశాంత్ నీల్, అయాన్ ముఖర్జీ, తరుణ్ భాస్కర్, శౌర్యువ్, సుధీర్ వర్మ ఇలా క్రేజీ దర్శకులతో తారక్ సినిమాలు ఉండనున్నాయని తెలుస్తోంది. దాంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.