Saturday, December 28, 2024
Google search engine
HomeUncategorizedJayam Movie: జయం సినిమాలో చిన్నప్పటి గోపీచంద్ గుర్తున్నాడా..? ఇప్పుడేం చేస్తున్నాడంటే..

Jayam Movie: జయం సినిమాలో చిన్నప్పటి గోపీచంద్ గుర్తున్నాడా..? ఇప్పుడేం చేస్తున్నాడంటే..

టాలీవుడ్ హీరో నితిన్ హీరోగా వెండితెరకు పరిచయమైన సినిమా జయం. డైరెక్టర్ తేజ దర్శకత్వం వహించిన ఈసినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఒకప్పుడు యూత్‏కు తెగ నచ్చేసిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ. ఇందులో నితిన్ సరసన సదా కథానాయికగా నటించింది. తేజ తెరకెక్కించిన ఈ సినిమాతోనే నితిన్, సదా ఇద్దరూ తెలుగు తెరకు నటీనటులుగా పరిచయంకాగా… అప్పట్లో జయం సినిమా సృష్టించిన సంచలనం గురించి చెప్పక్కర్లేదు. అలాగే ఈ సినిమాలోని సాంగ్స్ గురించి తెలిసిందే. మ్యూజికల్ హిట్ గా నిలిచిన ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్. ఆర్పీ పట్నాయక్ అందించిన మ్యూజిక్ సినిమాకే హైలెట్ అయ్యింది. అలాగే ఈ సినిమాలో హీరో గోపిచంద్ విలన్ పాత్రలో అదరగొట్టేశారు. జయం చిత్రంలో నితిన్, సదా, గోపిచంద్ ముగ్గురి నటనపై ప్రశంసలు వచ్చాయి.

విలన్ పాత్రలో గోపిచంద్ తనదైన నటనతో మెప్పించగా.. ఈ సినిమాలో చైల్డ్ ట్రాక్ కూడా ఉందన్న సంగతి తెలిసిందే. చిన్నప్పుడే రఘు, సుజాతల స్నేహం, గొడవ గురించి సినిమా మొదట్లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారు. ఇందులో రఘు (గోపిచంద్) చిన్నప్పటి నుంచి నెగిటివ్ షేడ్స్ ఉన్న కుర్రాడు. గోపిచంద్ చిన్నప్పటి పాత్రలో కనిపించి మెప్పించిన కుర్రాడు దిలీప్ కుమార్ సాల్వాది. 1990లో చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ చేశాడు. కృష్ణ నంబర్ 1 సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన దిలీప్.. దాదాపు 20 చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించాడు. పుణ్యభూమి నా దేశం, మౌనం, ధర్మచక్రం, స్నేహం కోసం, అనగనగా ఓ అమ్మాయి, అన్నయ్య, మా అన్నయ్య, డాడి, జయం, భాగ్మతి వంటి చిత్రాల్లో నటించాడు.

2005 తర్వాత పలు చిత్రాల్లో కీలకపాత్రలు పోషించాడు. 2019లో వచ్చిన దిక్సూచీ సినిమాతో హీరోగా మారాడు. దొంగల బండి, షీ వెబ్ సిరీస్ సీజన్ 2 లో నటించాడు. కానీ దిలీప్ కుమార్ సాల్వదికి హీరోగా అంతగా గుర్తింపు రాలేదు. కానీ వచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకుంటూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments