Jani Master: అడిగిన సహాయాన్ని గుర్తుంచుకుని మరీ మాటిచ్చారు.. రామ్ చరణ్ దంపతులపై జానీ మాస్టర్ ట్వీట్..

0
29
సరైన సమయంలో సాయం చేస్తే దేవుడు అంటారు.. జానీ మాస్టర్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దంపతులు ఇచ్చిన మాటతో తన సంతోషం వెయ్యి రెట్లైందన్నారు కొరియోగ్రాఫర్ రామ్ చరణ్. డ్యాన్సర్స్ యూనియన్‎లోని కుటుంబాలకు హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో సాయం చేస్తానని చరణ్ సతీమణి ఉపాసన మాటిచినట్లు తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చరణ్ దంపతులతో కలిసి దిగిన ఫోటో ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం జానీ మాస్టర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. సౌత్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్లలో జానీ మాస్టర్ ఒకరు. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో ఎన్నో సినిమాలకు వర్క్ చేశారు. సాధారణ డ్యాన్సర్ నుంచి డ్యాన్స్ మాస్టర్ గా ఎదిగి ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు.

ఓవైపు సినిమాలకు కొరియోగ్రాఫర్ గా వర్క్ చేస్తూనే మరోవైపు బుల్లితెరపై పలు రియాల్టీ డ్యాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. నిన్న జానీ మాస్టర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సినీ సెలబ్రెటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ జానీ మాస్టర్ ను ఇంటికి పిలిచి మరీ స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలిపారు. అలాగే ప్రత్యేకంగా బహుమతిని కూడా అందించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ రామ్ చరణ్ దంపతులు తనకు ఇచ్చిన మాట గురించి చెబుతూ సంతోషం వ్యక్తం చేశారు.

“సరైన సమయంలో సహాయం చేస్తే దేవుడు అంటారు. నా పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ అన్న ఇంటికి పిలిచినపుడు వారికి నా మీదున్న ప్రేమకి చాలా సంతోషపడ్డాను. కానీ అక్కడికి వెళ్ళాక మెగాస్టార్ చిరజీవి గారి ఆశీర్వాదంతోపాటు చరణ్ అన్న ఉపాసన కొణిదెల వదిన నాకు ఇచ్చిన మాటకి నా సంతోషం 1000 రెట్లు పెరిగింది. నేను ఇదివరకు అడిగిన సహాయాన్ని గుర్తుంచుకుని మా డ్యాన్సర్స్ యునియన్ టి. ఎఫ్. టి. టి. డి. ఎ లో 500లకు పైగా కుటుంబాలకి హెల్త్ ఇన్స్యూరెన్స్ అందేలా వారు అండగా నిలబడతామన్నారు. అడిగిన సహాయాన్ని గుర్తుంచుకుని, ఇచ్చిన మాటకి విలువనిస్తూ, అన్ని కుటుంబాలని చేరదీయడం మామూలు విషయం కాదు. మా అందరి మనసులో కృతజ్ఞత భావం ఎల్లకాలం ఉంటుంది. మా అందరి తరపు నుండి అన్న, వదినలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీలాంటి వారితో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. – జాని మాస్టర్ ( కొరియోగ్రాఫర్ )” అంటూ రాసుకొచ్చారు జానీ మాస్టర్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here