Jabardasth Faima: పెళ్లి ఎప్పుడో చెప్పేసిన జబర్దస్త్ ఫైమా.. ప్రియుడి ఇంటిపేరు ఇదే

0
50
Jabardasth Faima: పెళ్లి ఎప్పుడో చెప్పేసిన జబర్దస్త్ ఫైమా.. ప్రియుడి ఇంటిపేరు ఇదే

Jabardasth Faima: పెళ్లి ఎప్పుడో చెప్పేసిన జబర్దస్త్ ఫైమా.. ప్రియుడి ఇంటిపేరు ఇదే

బుల్లితెర నుంచి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. ఇక ప్రముఖ బుల్లితెర షో జబర్దస్త్ ద్వారా చాలా మంది ప్రేక్షకులకు దగ్గరయ్యారు. కొంతమంది కమెడియన్స్ గా సినిమాల్లో చేస్తున్నారు. మరికొంతమంది హీరోలుగా మారారు.. వీరితో పాటు వేణు, ధనరాజ్ లాంటి వారు దర్శకులుగా తమ ప్రతిభ చాటుకుంటున్నారు. ఇక జబర్దస్త్ లో చేసిన లేడీ కంటెంట్స్ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి వారిలో ఫైమా ఒకరు. జబర్దస్త్ లో తన కామెడీ పంచ్ లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. టీవీ షోలో నవ్వులు పూయించిన ఫైమా అదే క్రేజ్ తో తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొని తనదైన శైలిలో ఆట ఆడిప్రేక్షకులను అలరించింది. టాస్కులు చాలా బాగా ఆడి ఆడియన్స్ ను అలరించింది.

అలాగే పలు టీవీ షోల్లోనూ కనిపించి నవ్వులు పూయించింది. ఇదిలా ఉంటే ఫైమా త్వరలోనే పెళ్లి చేసుకోనుంది. ఈ చిన్నది పటాస్ ప్రవీణ్‌తో ప్రేమలో ఉందని గతంలో వార్తలు వచ్చాయి. ఈ ఇద్దరూ కలిసి కొన్ని వీడియోలు చేయడం , షాపింగ్ చేయడంతో ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు పుట్టుకొచ్చాయి. ఇటీవలే తన పుట్టిన రోజున ప్రవీణ్ అనే వ్యక్తితో రిలేషన్ లో ఉన్నాను అని చెప్పి అందరిని సర్‌ప్రైజ్ చేసింది ఫైమా..

తాజాగా ఫైమా సోషల్ మీడియాలో నెటిజన్స్ తో ముచ్చటించింది. ఈ సందర్భంగా నెటిజన్స్ ఆమెను రకరకాల ప్రశ్నలు అడిగారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అక్కా.? అని అడగ్గా.. తొందరలో అని తెలిపింది. అలాగే తనచేసుకోబోయేవాడి ఇంటి పేరు బాదావత్ అని హింట్ ఇచ్చింది ఫైమా. అలాగే తన పెళ్లి గురించి ఇంకా ఏదైనా అడగాలనుకుంటే వ్లాగ్‌లో క్లారిటీ ఇస్తాను చెప్పుకొచ్చింది. వీటితో పాటు ఓ కొత్త యూట్యూబ్ చానల్ స్టార్ట్ చేశాను సపోర్ట్ చేయండి సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేసింది ఫైమా..

 

View this post on Instagram

 

A post shared by FAIMA (@faima_patas)

జబర్దస్త్ ఫైమా ఇన్ స్టా..

 

View this post on Instagram

 

A post shared by FAIMA (@faima_patas)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here