Jabardasth: తండ్రి వయసున్న వ్యక్తి అలా ప్రవర్తించాడు.. కాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ విషయం చెప్పిన జబర్దస్త్ నటి

0
21
తండ్రి వయసున్న వ్యక్తి అలా ప్రవర్తించాడు..

సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి చాలా కాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది కాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పారు. చాలా మంది హీరోయిన్స్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి.. వారికి ఎదురైనా చేదు అనుభవాల గురించి మాట్లాడారు. కొంతమంది స్టార్ హీరోయిన్స్ కూడా కాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ విషయాలు చెప్పారు. మరికొంతమంది తాము అలాంటివి ఎదురుకోలేదు కానీ అన్ని చోట్ల ఈ సమస్య ఉంటుంది అని అన్నారు. ఇక కాస్టింగ్ కౌచ్ పై సింగర్ చిన్మయి లాంటి వారు ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. అలాగే ఇండస్ట్రీలో ఎవరికైనా ఇలాంటి సమస్య వస్తే అండగా నిలుస్తున్నారు కూడా.. ఇదిలా ఉంటే తాజాగా ఓ జబర్దస్త్ నటి కూడా కాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ విషయం చెప్పింది. ఆఫర్స్ కోసం కమిట్మెంట్ అడుగుతారు అని చెప్పి షాక్ ఇచ్చింది.

ఆమె మరెవరో కాదు రోహిణి.. ఇండస్ట్రీలో చాలా మంది కమెడియన్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు తమ ప్రతిభను చాటుకొని ప్రేక్షకులను అలరిస్తూ.. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల్లో కమెడియన్స్ గా మగాళ్లు మాత్రమే కాదు.. ఎంతో మంది ఆడవారు కూడా తమ కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కోవై సరళ, హేమ, సురేఖ వాణి, గీత సింగ్ ఇలా ఇప్పటికే చాలా మంది లేడీ కమెడియన్స్ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు వారిలో రోహిణి ఒకరు. ప్రముఖ టీవీ ఛానెల్ లో టెలికాస్ట్ అవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా రోహిణి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఆమె తన చలాకీ తనంతో .. కామెడీ టైమింగ్స్ తో మంచి పాపులారిటీ తెచ్చుకున్న రోహిణి..కొన్ని సినిమాల్లోనూ కనిపించింది. సేవ్ ద టైగర్స్ సీరీస్, అలాగే హనుమాన్ సినిమాల్లో తన నటనతో ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే తాజాగా రోహిణి మాట్లాడుతూ కాస్టింగ్ కౌచ్ గురించి కామెంట్స్ చేసింది. కెరీర్ బిగినింగ్ లో ఆఫర్స్ కోసం చాలా మందికి దగ్గరకు వెళ్లానని ఆ టైం లో అసభ్యకరంగా ప్రవర్తించారు అని తెలిపింది. అలాగే కమిట్మెంట్ గురించి ఎక్కువగా అడిగే వారిని చెప్పుకొచ్చింది. అలాగే ఓసారి ఆడిషన్ కు వెళ్తే తన తండ్రి వయసున్న వ్యక్తి కూడా నాకేంటి అని అసభ్యకరంగా మాట్లాడాడు.. దాంతో ఆ సినిమాను రిజెక్ట్ చేశా అని తెలిపింది రోహిణి. అలా కెరీర్ లో ఎన్నో ఇబ్బందులు ఎదురుకున్నా కానీ ఎప్పుడూ తప్పుడు మార్గంలోకి వెళ్లదు అని చెప్పుకొచ్చింది రోహిణి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here