Indian 2 Twitter Review: భారతీయుడు 2 ట్విట్టర్ రివ్యూ.. మళ్లీ శంకర్, కమల్ కాంబో హిట్ అయ్యిందా..?

0
17
భారతీయుడు 2 ట్విట్టర్ రివ్యూ..

ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ ఫుల్ ఫాంలో ఉన్నాడు లోకనాయకుడు కమల్ హాసన్. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన విక్రమ్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న కమల్.. ఇక ఇటీవల కల్కి సినిమాతో మరోసారి అలరించాడు. ఇప్పటికే కల్కి రూ.1000 కోట్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ సృష్టిస్తుండగా.. ఇప్పుడు ఇండియన్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆరేళ్ల కింద మొదలైన.. ఐదేళ్లుగా సెట్స్ పైనే ఉంది. ఇక కొన్ని కారణాలతో రెండేళ్లు ఆగిపోయింది. ఏడాదిన్నర కింద హడావిడిగా మొదలైన ఈ సినిమా మొత్తానికి అడ్జంకులు దాటుకుని ఇప్పుడు థియేటర్స్‌లోకి వచ్చింది. గతంలో సూపర్ హిట్ అయిన ఇండియన్ చిత్రానికి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్ శంకర్. కేవలం ఇండియన్ 2 మాత్రమే కాదు.. దీనికి పార్ట్ 3 కూడా ఉందని ఇప్పటికే కన్ఫార్మ్ చేశారు దర్శకనిర్మాతలు. పార్ట్ 2లో కాజల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ కీలకపాత్రలు పోషించారు.

విడుదలకు ముందు నుంచే భారీ హైప్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా.. ట్రైలర్, పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేశారు. ఇక ఈ సినిమా ఎట్టకేలకు జూలై 12న థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే ఈ మూవీ ప్రీమియర్స్ చూసిన అడియన్స్ తమ రివ్యూస్ ఇస్తున్నారు. ఫస్టాఫ్ బోరింగ్ గా ఉన్న సెకండ్ ఆఫ్ బాగుందని అంటున్నారు. ఇక కమల్ హాసన్ నటన గురించి చెబుతూ.. మరోసారి విశ్వనటుడు యాక్టింగ్ పీక్స్ లో ఉందని.. కానీ శంకర్ మార్క్ మిస్ అయ్యిందని అంటున్నారు. ఇక సిద్ధార్థ్, రకుల్ యాక్టింగ్ బాగుందని.. ఇంటర్వెల్, క్లైమాక్స్, ట్విస్టులు బాగున్నాయని అంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here