Indian 2: భారతీయుడు2 పై మర్మకళ వివాదం రిలీజ్‌ అవుతుందా ?? లేదా ??

0
46
భారతీయుడు2 పై మర్మకళ వివాదం రిలీజ్‌ అవుతుందా ?? లేదా ??

భారతీయుడు సినిమా అనగానే.. ఆ సినిమాలో కమల్ ప్రదర్శించే మర్మకళే మైండ్‌లోకి వస్తుంది. తన రెండు చేతి వేళ్లతో.. శత్రువుల నరాలపై గుచ్చుతూ.. వారిని కదలనివ్వకుండా చేస్తూ.. భారతీయుడు సినిమాలో అందర్నీ ఆకట్టుకున్నారు కమల్. అయితే భారతీయుడికి ప్లస్‌గా ఉన్న ఈ కళే.. ఇప్పుడు ఆయనకు ఇబ్బందిగా మారింది. రిలీజ్కు ముందు చిన్న పాటి చిక్కు తెచ్చింది. ఇక అసలు విషయం ఏంటంటే..! భారతీయుడు సినిమా విడుదలైన 25 ఏళ్లకి.. సీక్వెల్‌గా భారతీయుడు-2 సినిమా వస్తోంది. ఈనెల 12న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. కానీ అంతకన్న ముందు కోర్టు నోటీసులు మూవీ యూనిట్‌ను కంగారుపెడుతున్నాయి. కారణం.. సినిమాను నిలిపివేయాలని మర్ళకళ స్పెషలిస్ట్‌ రాజేంద్రన్‌ కోర్టుకెళ్లడమే. మర్మకళకు సంబంధించిన సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారాయన. దీంతో అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ అవుతుందా లేదా అన్నది కమల్ ఫ్యాన్స్‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Mahesh Babu: ‘అద్భుతం.. జస్ట్‌ వావ్‌’ కల్కి కి మహేష్ సూపర్ రివ్యూ…

TOP 9 ET News: హాలీవుడ్‌లో కల్కి ప్రభంజనం కెనడాలో ఏకంగా దిమ్మతిరిగే కలెక్షన్స్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here