Hrithik Roshan: రెండో పెళ్లికి రెడీ అయిన స్టార్ హీరో.. ఆ యంగ్ హీరోయిన్‌తో కలిసి ఏడడుగులు వేయనున్న హృతిక్

0
23
Hrithik Roshan: రెండో పెళ్లికి రెడీ అయిన స్టార్ హీరో.. ఆ యంగ్ హీరోయిన్‌తో కలిసి ఏడడుగులు వేయనున్న హృతిక్

Hrithik Roshan: రెండో పెళ్లికి రెడీ అయిన స్టార్ హీరో.. ఆ యంగ్ హీరోయిన్‌తో కలిసి ఏడడుగులు వేయనున్న హృతిక్
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ రెండో పెళ్లికి రెడీ అయిపోయాడా ఇప్పటికే మొదటి భార్యకు విడాకులు ఇచ్చేసిన ఈ గ్రీకు వీరుడు  త్వరలోనే ఓ యంగ్ హీరోయిన్ తో పెళ్లిపీటలెక్కనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది బాలీవుడ్ మీడియా సర్కిళ్లలో. త్వరలోనే తమ పెళ్లి విషయంలో ఇద్దరూ ఓ గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు కోడై కూస్తోంది. వివరాల్లోకి వెళితే.. మొదటి భార్యతో విడిపోయాక యంగ్ బ్యూటీ  షబా ఆజాద్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నాడు హృతిక్ రోషన్. ఇద్దరూ కలిసే టూర్లు, వెకేషన్లు, పార్టీలు, ఫంక్షన్లలో సందడి చేశారు. ఇప్పుడు తమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనీ ఈ జోడీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్ గా షబా ఆజాద్.. రివీలింగ్ సూన్'(త్వరలోనే బయటపెడతాను) అంటూ ఇన్ స్టా గ్రామ్ లో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. దీనికి హృతిక్ రోషన్ కూడా స్పందించాడు. ‘ఆగలేకపోతున్నాను’ అంటూ షబా పోస్టుకు క్రేజీ కామెంట్ పెట్టాడు. దీనిని బట్టి చూస్తుంటే త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారని క్లియర్ గా అర్థమవుతోందని కొందరు నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అయితే నిజంగానే ఈ ప్రేమ జంట వివాహం చేసుకోనుందా? లేక ఏదైనా మూవీ, యాడ్ ప్రమోషన్ స్టంటా?అంటూ మరికొందరు అనుమానాలు, సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా వెలుగొందుతోన్న హృతిక్ రోషన్ కు తెలుగు నాట కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా క్రిష్ సినిమాతో ఇక్కడి వారికి బాగా చేరువయ్యాడు హృతిక్. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి వార్ 2 సినిమాలో నటిస్తున్నాడీ హ్యాండ్సమ్ హీరో. సినిమాల సంగతి పక్కన పెడితే.. 2000లో సెలబ్రిటీ ఇంటీరియర్ డిజైనర్ సుస్సానే ఖాన్ ను హృతిక్ పెళ్లి చేసుకున్నాడు. వీరికి హ్రీహాన్,  హ్రిధాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే 2014లో హృతిక్, సుసానే విడాకులు తీసుకున్నారు. దీని తర్వాత సుస్సానే ఖాన్ మరో వ్యక్తితో రిలేషన్ షిప్ లో ఉంది. హృతిక్ కూడా షబా ఆజాద్ తో ప్రేమలో ఉన్నాడు.

షబా ఆజాద్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

 

View this post on Instagram

 

A post shared by Saba Azad (@sabazad)

హృతిక్ రోషన్ తో షబా ఆజాద్..

 

View this post on Instagram

 

A post shared by Saba Azad (@sabazad)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here