Hina Khan: క్యాన్సర్‌తో పోరాడుతూ షూటింగ్ లో పాల్గొన్న నటి.. గొంతుపై టేప్‌.?

0
31
క్యాన్సర్‌తో పోరాడుతూ షూటింగ్ లో పాల్గొన్న నటి.. గొంతుపై టేప్‌.?

బాలీవుడ్‌ నటి హీనాఖాన్‌ స్టేజ్​3 రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతోంది. ప్రస్తుతం ఆమె కీమోథెరపీ చికిత్స తీసుకుంటోంది. అయినా సరే.. ఆమె సాహసానికి సిద్ధమై తిరిగి షూటింగ్​లలో పాల్గొన్నట్లు స్వయంగా ఆమే తెలిపింది.

లైఫ్ లో అతిపెద్ద సమస్యను ఎదుర్కొంటున్న సమయంలోనూ పని చేయడం ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని చెప్పింది హీనాఖాన్. మంచి రోజులు ఎంత తక్కువగా ఉన్నా సంతోషంగా గడపడం మర్చిపోకూడదని పోస్ట్‌ చేసింది. కష్టాలను పెద్దగా చూడాల్సిన అవసరమే లేదనీ మార్పును అంగీకరించి మునుపటిలా ఉండేందుకు ట్రై చేయాలనీ హితవు పలికింది. మంచి రోజుల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. అందుకోసం ఇష్టపడే పని చేస్తున్నాననీ అందుకే షూటింగ్‌లకు రెడీ అయ్యాననీ ఎవరైనా వారి మనసుకు సంతోషానిచ్చే పని చేయండని కోరింది. ఛాలెంజ్ లను ఎదుర్కొనేందుకు మరింత శక్తిని ఇస్తుందని రాసుకొచ్చింది. కాగా, హీనా పెట్టిన పోస్ట్​కు చాలా మంది సామాన్యులు, సెలబ్రిటీలు మద్దతు తెలుపుతున్నారు.

బాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన నటీనటులలో హీనా ఖాన్ ఒకరు. తాను క్యాన్సర్‌ బారిన పడినట్లు తెలుపుతూ రెండు వారాల క్రితం ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టింది. తన కుటుంబసభ్యులు, స్నేహితుల సహకారంతో క్యాన్సర్‌ మహమ్మారితో పోరాటం చేస్తున్నానని తెలిపింది. దీంతో సినీ ఇండస్ట్రీలోని ప్రముఖలు ఆమెకు ధైర్యాన్నిస్తున్నారు. తాజాగా హీనా ఖాన్‌ను ఉద్దేశిస్తూ సమంత పోస్ట్‌ పెట్టింది. దానికి వారియర్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌ను జోడించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here