Harish Shankar: బావా అంటూనే.. కామెంట్ చేసిన వాడికి గూబగుయ్‌ మనిపించిన డైరెక్టర్.

0
42
బావా అంటూనే.. కామెంట్ చేసిన వాడికి గూబగుయ్‌ మనిపించిన డైరెక్టర్..

నిన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూట్‌తో బిజీగా ఉన్న డైరెక్టర్ హరీశ్ శంకర్ .. పవన్ ఏపీ మంత్రిగా మారిపొవడంతో.. రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమా మొదలెట్టాడు. జెట్ స్పీడ్లో ఈ సినిమా షూటింగ్‌ ను ఫినిస్ చేస్తున్నాడు. ఇక ఈక్రమంలోనే ఈ సినిమా నుంచి సితార పేరుతో ఫస్ట్ సింగిల్‌ ను రిలీజ్ కూడా చేశాడు. కానీ ఇప్పుడీ సాంగ్‌పై.. అందులోనూ రవితేజ , హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే ఏజ్‌పై.. వీరిద్దరూ వేసిన ఓ హుక్ స్టెప్‌ పై నెట్టింట ఓ రచ్చ మొదలైంది. అయితే ఈ రచ్చను తిప్పికొట్టే ప్రయత్నంలో ఓ నెటిజన్ చేసిన కాంట్రో కామెంట్‌కు సెటైరికల్ గా ఇచ్చిపడేశాడు డైరెక్టర్ హరీష్.

ఇక మిస్టర్ బచ్చన్ నుంచి సితార్ అంటూ సాగే ఈ పాట విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్ లో దూసుకుపోతుంది. అలాగే పాటలోని లిరిక్స్ కూడా ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. అంతేకాకుండా ఈ పాటలో రవితేజ, హీరోయిన్ భాగ్య శ్రీ కెమిస్ట్రీ.. బ్యూటీఫుల్ స్టెప్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సాంగ్ బాగుందంటూ కామెంట్స్ వస్తుండగా.. కొందరు నెటిజన్స్ మాత్రం భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు. తెలుగు సినిమాల్లో హీరోయిన్లను కేవలం వస్తువులాగే చూపిస్తారని మండిపడుతున్నారు.

తాజాగా నెటిజన్ సితార్ పాటపై రియాక్ట్ అవుతూ.. 56 ఏళ్ల రవితేజతో కేవలం 25 ఏళ్ల హీరోయిన్ భాగ్య శ్రీ స్టెప్పులు వేయడం.. అలాగే హీరోయిన్ మొహం కూడా చూపించకుండా ఇలా చేయడం కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే సాధ్యం అంటూ ట్వీట్ చేశాడు. ఇక దీనిపై డైరెక్టర్ హరీశ్ శంకర్ కాస్త సెటైరికల్ గా రియాక్ట్ అయ్యాడు. “కంగ్రాట్స్.. ఇది నువ్వు కనిపెట్టినందుకు. నువ్వు నోబెల్ ఫ్రైజ్ కు దరఖాస్తు చేసుకో.. అలాగే నువ్వు దీనిని కొనసాగిస్తూ ఫిల్మ్ మేకర్స్ ను ప్రశ్నిస్తూ ఉండాలి. నీలాంటి వారికి ఎప్పుడూ వెల్ కమ్ చెబుతూనే ఉంటాను” అంటూ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం హరీశ్ శంకర్ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here