Tuesday, November 19, 2024
Google search engine
HomeUncategorizedHardik Pandya: ముందుగానే జాగ్రత్త పడిన హార్దిక్ పాండ్యా.. ఆస్తులన్నీ ఆమె పేరు మీదనే.. నటాషాకు...

Hardik Pandya: ముందుగానే జాగ్రత్త పడిన హార్దిక్ పాండ్యా.. ఆస్తులన్నీ ఆమె పేరు మీదనే.. నటాషాకు భరణం ఎంతంటే?

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిచ్ విడాకులు తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా రూమర్లుగానే ఉన్న వార్తలను నిజం చేస్తూ సోషల్ మీడియా ద్వారా 4 సంవత్సరాల వివాహా బంధానికి వీడ్కోలు పలికారు. అయితే విడాకుల తర్వాత హార్దిక్ పాండ్యా తన భార్య నటాషాకు పాండ్యా ఎంత భరణం ఇస్తాడనే చర్చలు మొదలయ్యాయి. హార్దిక్ పాండ్యా విడాకులు తీసుకుంటే తన ఆస్తిలో 70% భార్యకు ఇవ్వాల్సి ఉంటుందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే అదేమీ లేదని, పాండ్యా నుంచి నటాషాకు భారీ మొత్తంలో భరణమేమీ లభించదని తెలుస్తోంది. దీనికి సంబంధించి హార్దిక్ పాత వీడియో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. 2018లో గౌరవ్ కపూర్ ‘బ్రేక్‌ఫాస్ట్ విత్ ఛాంపియన్స్’ ప్రోగ్రాంలో హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ, ‘నేను నా ఆస్తులన్నింటినీ మా అమ్మ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాను. నా పేరు మీద ఏమీ లేవు’ అన్నారు. దీనికి గల కారణాన్ని అప్పుడే చెప్పుకొచ్చాడు హార్దిక్ పాండ్యా.

నాకు ఉన్న కార్ల నుంచి ఇళ్ల వరకు అన్నీ అమ్మ పేరు మీదనే ఉన్నాయి. నేను ఎవరినీ నమ్మను. అందుకే అమ్మ పేరు మీద అన్నీ రిజిస్ట్రేషన్ చేశాను. ఎందుకంటే భవిష్యత్తులో ఎవరికీ నా ఆస్తులు ఇవ్వాల్సిన అవసరం రాకూడదు. అంటే భవిష్యత్తులో నేను పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంటే నా ఆస్తిలో 50% ఎవరికీ ఇవ్వనక్కర్లేదు. అందుకే అమ్మ పేరు మీద అన్నీ కొన్నాను’ అని హార్దిక్ పాండ్యా బహిరంగంగా చెప్పుకొచ్చాడు.
ఇప్పుడు నటాషా స్టాంకోవిచ్‌తో హార్దిక్ పాండ్యా విడాకులు తీసుకున్నాడు. కానీ ఈ విడాకుల సెటిల్ మెంట్ గా పాండ్యా ఆస్తిలో 50% వాటా నటాషాకు భరణం కింద దక్కడం అనుమానమే. ఎందుకంటే హార్దిక్ పాండ్యా చెప్పినట్లు ఆస్తులన్నీ అమ్మ పేరు మీదనే ఉన్నాయి. కాబట్టి నటాషాకు తక్కువ మొత్తంలో మాత్రమే భరణం అందవచ్చని తెలుస్తోంది.\

ఇవి కూడా చదవండి

హార్దిక్ పాండ్యా లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

నటాషా స్టాంకోవిచ్ పోస్ట్..

ముంబై ఎయిర్ పోర్టులో కుమారు అగస్త్య తో నటాషా స్టాంకో విక్.. వీడియో

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments