Hardik Pandya: నటాషాతో విడాకుల రూమర్లు.. హార్దిక్ పాండ్యాతో కనిపించిన ఈ హాట్ బ్యూటీ ఎవరో తెలుసా?

0
20
నటాషాతో విడాకులు!హార్దిక్‌తో కనిపించిన ఈ హాట్ బ్యూటీ ఎవరో తెలుసా?

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, అతని భార్య నటాషా స్టాంకోవిచ్‌ల విడిపోనున్నారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. వీరిద్దరూ ఇప్పటికే విడిగా ఉన్నరని, త్వరలోనే విడాకుల తీసుకుంటారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే నెట్టింట ఇంత జరుగుతున్నా అటు హార్దిక్ పాండ్యా కానీ, ఇటు నటాషా స్టాంకోవిచ్ లు కూడా ఒక్క మాట మాట్లాడకపోవడం మరింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇలా నటాషాతో విడాకుల రూమర్లు చక్కర్లు కొడుతుండగానే హార్దిక్ పాండ్యా ఒక హాట్బ్యూటీతో కనిపించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాలు తెగ వైరలవుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు ఈ హాట్ బ్యూటీ ఎవరబ్బా అని ఆరా తీస్తున్నారు. అయితే ఆమె మరెవరో కాదు.. ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ ప్రాచీ సోలంకి. అలాగే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. ఇటీవల ఆమె హార్దిక్ పాండ్యాతో కలిసి కనిపించింది. అలాగే కృనాల్ పాండ్యా ఫ్యామిలీతో కలిసి ఫొటోలు కూడా దిగింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కాగా ఈ ఫొటోల్లో హార్దిక్ పాండ్యా, ప్రాచీ సోలంకిలు ఎంతో క్యూట్ గా కనిపిస్తున్నారు. దీంతో అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. అయతే వీరిద్దరు డేటింగ్ లో ఉన్నారన్నదానిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అయితే ఎన్నడూ లేని విధంగా ప్రాచీ సోలంకీ ఇప్పుడు పాండ్యా కుటుంబానికి అత్యంత సన్నిహితంగా కనిపించడంతో కొత్త రూమర్లు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

ప్రాచీ సోలంకితో హార్దిక్ పాండ్యా.. వీడియో ఇదిగో..

మరోవైపు హార్దిక్ పాండ్యా టీ20 ప్రపంచకప్ గెలిచినా అతని భార్య నటాషా సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ చేయలేదు. దీంతో పాండ్యా దంపతుల మధ్య మనస్పర్థలు వచ్చినట్లు తేల్చేశారు కొందరు నెటిజన్లు. త్వరలో వీరిద్దరూ విడాకులు తీసుకోనున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. అందుకే రానున్న రోజుల్లో పాండ్యా దంపతులు విడాకులు తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని వార్తలు వస్తున్నాయి.

ప్రాచీ సోలంకి లేటెస్ట్ ఫొటోస్..

బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో ప్రాచీ సోలంకి.. ఫొటోస్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here