విశ్వనాయకుడు కమల్ హాసన్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో గుణ ఒకటి. 1991లో విడుదలైన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. స్వాతి ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఈ సినిమాను పల్లవి, చరణ్ సంయుక్తంగా నిర్మించగా.. సంతాన భారతి దర్శకత్వం వహించారు. ఇందులో కమల్ హాసన్ సరసన రేఖ కథానాయికగా నటించగా.. తమిళంతోపాటు తెలుగులోనూ విడుదలై పాజిటివ్ రివ్యూస్ అందుకుంది. ఇక ఇటీవలే విడుదలైన మంజుమ్మెల్ బాయ్స్ సినిమాతో మరోసారి గుణ మూవీ తెరపైకి వచ్చింది. ఈ సినిమాలోని ప్రియతమా పాట సూపర్ హిట్ కావడంతో మంజుమ్మెల్ బాయ్స్ చిత్రంలో ఈ పాటను ఉపయోగించారు. దీంతో గుణ సినిమా గురించి నెటిజన్స్ సెర్చింగ్ స్టార్ట్ చేశారు.
అయితే జూన్ 21న ఈ సినిమాను పిరమిడ్, ఎవర్ గ్రీన్ మీడియా కలిసి తమిళనాడులో ఈ సినిమాను రీరిలీజ్ చేశాయి. దీంతో వారికి కోర్టు నోటీసులు జారీ చేసింది. గుణ సినిమాను మరోసారి రీరిలీజ్ చేయకుండా ఆపాలని మద్రాసు హైకోర్టులో పిటీషన్ దాఖలు అయ్యింది. ఈ సినిమా కాపీరైట్స్ తాను కొనుగోలు చేసినట్లు గన్ శ్యామ్ హేమ్ దేవ్ పేర్కొన్నారు. గుణ సినిమాకు పూర్తి యజమానిగా తనను ప్రకటించాలని కోర్టును ఆశ్రయించారు. అలాగే ఈ సినిమా రీరిలీజ్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని తనకు ఇవ్వాలని అన్నారు.
అలాగే గుణ సినిమాను మళ్లీ రీరిలీజ్ చేయకుండా శాశ్వత నిషేదం విధించాలని కోరారు. దీంతో గుణ సినిమా రీరిలీజ్ పై మధ్యంతర నిషేధం విధిస్తూ కోర్టు నోటీసులు జారీ చేసింది. గన్ శ్యామ్ హేమ్ దేవ్ పిటీషన్ పై పిరమిండ్, ఎవర్ గ్రీన్ మీడియా కూడా జూలై 22లోగా స్పందించాలని కోర్టు తెలిపింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.