ఇంతకంటే షాక్ ఇవ్వరు అన్న ప్రతీసారి.. దానికి మించిన షాక్ రెడీ చేస్తుంటారు శంకర్. గేమ్ ఛేంజర్ గురించి రోజుకో ముచ్చట చెప్పి అభిమానులను పరేషాన్ చేస్తున్నారు ఈ దర్శకుడు. తాజాగా ఇండియన్ 2 ప్రమోషన్స్‌లో మరోసారి చరణ్ సినిమాపై షాకిచ్చారు శంకర్. ఈయన ఇచ్చిన అప్డేట్తో చరణ్ ఫ్యాన్స్‌కు ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి.
శంకర్ ప్రస్తుతం భారతీయుడు 2 ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. మరో 10 రోజుల్లోనే ఈ చిత్ర విడుదల ఉండటంతో.. పూర్తిగా దానికే టైమ్ కేటాయిస్తున్నారు శంకర్. ఇప్పట్లో ఈయన గేమ్ ఛేంజర్ వైపు వచ్చేలా కనిపించడం లేదు.
జులై 12న భారతీయుడు 2 రానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లోనే గేమ్ ఛేంజర్ అప్డేట్స్ కూడా ఇస్తున్నారు శంకర్. గేమ్ ఛేంజర్ కచ్చితంగా ఇదే ఏడాది విడుదలవుతుందని అభిమానులు ఆశించారు.. నమ్మారు కూడా.
ఎందుకంటే దిల్ రాజు సైతం ఈ సినిమాను అక్టోబర్‌లో విడుదల చేస్తామన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే సినిమా 2024లో కష్టమే అనిపిస్తుంది. ఎందుకంటే గేమ్ ఛేంజర్ షూటింగ్ ఇంకా 10 రోజులు బ్యాలెన్స్ ఉంది.
గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ ఇచ్చారు శంకర్. ఆయన చెప్పింది విన్నాక ఫ్యాన్స్‌కు షాక్ తప్పలేదు. ఎందుకంటే భారతీయుడు 2 విడుదలైన ఆర్నెళ్ళ తర్వాతే గేమ్ ఛేంజర్ రిలీజ్ చేస్తామంటున్నారు ఈ దర్శకుడు. ఈ లెక్కన 2024లో సినిమా రానట్లే. అన్నీ ఓసారి చూసుకున్నాకే.. గేమ్ ఛేంజర్ రిలీజ్ అంటూ కుండ బద్ధలు కొట్టారు శంకర్.