విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్‌రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో ఓ నాయికగా మీనాక్షి చౌదరిని ఎంపిక చేశారు. ఇప్పుడు ఇంకో నాయికగా ఐశ్వర్య రాజేష్‌ను సెలక్ట్ చేశారు. యాక్షన్ నేపథ్యంలో సాగే సినిమా అని, రేపటి నుంచి చిత్రీకరణ మొదలుపెడతామని చెప్పారు అనిల్ రావిపూడి.
భవిష్యత్తులో జేమ్స్ బాండ్ తరహా సినిమాలు తీయాలని ఉందని అన్నారు కెప్టెన్ శంకర్. హిస్టారికల్, సైన్స్ ఫిక్షన్ సినిమాలూ చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. తాను అనుకుంటున్న కథల స్పాన్ ఎక్కువని, భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాల్సినవేనని అన్నారు. వీఎఫ్ ఎక్స్ కి ప్రాధాన్యం ఉంటుందని, అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తానని చెప్పారు శంకర్.
త్వరలోనే దో పత్తీ సినిమాతో స్క్రీన్ మీదకు రావడానికి సిద్ధమవుతున్నారు నటి కృతి ససన్. తన కెరీర్లో మిమి అత్యద్భుతమైన సినిమా అని అన్నారు. నటిగా తన జీవితానికి కావాల్సిన ఎన్నో విషయాలను అందించిన సినిమా అని తెలిపారు. తనలోని నటనా నైపుణ్యాన్ని, ప్రతిభను వెలుగులోకి తెచ్చిన చిత్రమని చెప్పారు కృతి.
పరాజయాన్ని ఎదుర్కోగల సామర్థ్యం ఉన్నవారు మాత్రమే మంచి నటులని తన అభిప్రాయమని అన్నారు ఆయుష్మాన్ ఖురానా. తన దృష్టిలో సక్సెస్ చాలా చెడ్డదని చెప్పారు. వైఫల్యాలే మంచి స్నేహితులుగా మారుతాయని చెప్పారు. ప్రేక్షకులకు చేరువగా ఉండే కథలను, పాత్రలను ఎంపిక చేసుకోవడానికి తాను సిద్ధంగా ఉంటానని అన్నారు.
శ్రీరామ్ హీరోగా కోడిబుర్ర సినిమా మొదలైంది. శృతి మీనన్ ఇందులో నాయిక. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తామని అన్నారు హీరో శ్రీరామ్. తాను పోలీసాఫీసర్‌గా నటిస్తున్నానని, ఆద్యంతం ఉత్కంఠభరితమైన మలుపులతో సినిమా సాగుతుందని చెప్పారు. ఈ నెల 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నట్టు దర్శకనిర్మాతలు చెప్పారు.