Ester Noronha: ఇండస్ట్రీలో త్వరగా ఎదగాలంటే అదే షార్ట్ కట్.. ఎవ్వరూ బలవతం పెట్టరంటున్న ఎస్తర్ నోరాన్హా

0
18
Ester Noronha: ఇండస్ట్రీలో త్వరగా ఎదగాలంటే అదే షార్ట్ కట్.. ఎవ్వరూ బలవతం పెట్టరంటున్న ఎస్తర్ నోరాన్హా

Ester Noronha: ఇండస్ట్రీలో త్వరగా ఎదగాలంటే అదే షార్ట్ కట్.. ఎవ్వరూ బలవతం పెట్టరంటున్న ఎస్తర్ నోరాన్హా

సినిమా ఇండస్ట్రీలో ఉన్న సమస్యల్లో క్యాస్టింగ్ కౌచ్ ఒకటి. దీని పై ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలో చాలా మంది తమను లైంగికంగా వేధించారు అంటూ కొంతమంది ముద్దుగుమ్మలు మీడియా ముందు దైర్యంగా చెప్పారు. ఇంకొంతమంది సోషల్ మీడియా వేదికగా తాము ఎదురుకొన్న చేదు అనుభవాలను పంచుకున్నారు. మరికొంతమంది క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం పై పోరాటం చేస్తున్నారు కూడా.. కొంతమంది ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని అంటుంటే మరికొంతమంది మాత్రం అలాంటి అనుభవాలను మేము ఎదుర్కోలేదు అని చెప్తున్నారు. తాజాగా ఓ హీరోయిన్ క్యాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీలో ఎదగాలంటే షార్ట్ కట్ ఇదే అంటూ సంచలన కామెంట్స్ చేసింది.

ప్రముఖ సింగర్ నోయెల్ మాజీ భార్య, నటి ఎస్తర్ నోరాన్హా  తాజాగా క్యాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. సినిమా ఇండస్ట్రీలో ఎదగడానికి దేనికైనా సిద్ధమైతే కొంతమంది అడ్వాంటేజ్ తీసుకుంటారు అని అంటుంది ఎస్తర్ నోరాన్హా. సినీ ఇండస్ట్రీలో త్వరగా ఎదగాలి స్టార్ డమ్ రావాలి అని అనుకునేవారికి అదే షార్ట్ కట్ అని ఆమె అన్నారు. అలాగే సినిమా ఇండస్ట్రీలో మహిళలపై వేధింపులు ఎక్కువగా జరగడానికి కారణం ఇక్కడ ఉన్న పరిస్థితులే అని ఆమె చెప్పుకొచ్చారు.

అలాగే ఆమెమాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది. నేను అవకాశాల కోసం ఏదైనా చేస్తాను.. ఎంత దూరమైన వెళ్తాను అనుకునేవారు ఉంటారు. అలాంటి వారిని కొంతమంది లోబరుచుకుంటారు. అవకాశాల కోసం ఏం చేయస్తావ్ అనే వాళ్లు, అడ్వాంటేజ్ తీసుకునే వారు ఉంటారు. కానీ నేను అలాంటివి చేయను. నేను నా దారిలోనే వెళ్తాను అని మొండిగా ఉండే వారిని ఎవ్వరూ బలవంత పెట్టారు. ఆ ఛాయిస్ మాత్రం ఉంది అని అన్నారు ఎస్తర్ నోరాన్హా. చాలా మంది టాలెంట్ ను నమ్ముకొని ముందుకు వెళ్తున్నారని.. తాను కూడా అలానే తన టాలెంట్ ను, హార్డ్ వర్క్ ను నమ్ముకుంటున్నా అని తెలిపారు ఎస్తర్ నోరాన్హా. తన ప్రతిభ ద్వారా వచ్చే గుర్తింపునే నేను కోరుకుంటున్నా అని చెప్పుకోచ్చారు ఎస్తర్ నోరాన్హా. ఈ అమ్మడి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here