బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌కి ప్రతిష్టాత్మక 77వ లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్లో జీవితకాల సాఫల్య పురస్కారం దక్కనుంది. పార్డో అలా కెరియరో అస్కోనా – లోకర్నో టూరిజం అవార్డుతో ఆగస్టు 10న ఆయన్ని సత్కరించనున్నారు. ఈ సందర్భంగా షారుఖ్ దేవదాస్ మూవీని చిత్రోత్సవాల్లో ప్రదర్శించనున్నారు.
సినిమాల్లో నటించడంపై ఏపీ డెప్యూటీ సీఎం, నటుడు పవన్ కల్యాణ్ స్పందించారు. మూడు నెలల పాటు షూటింగులకు దూరంగా ఉంటానని అన్నారు. వీలున్నప్పుడు రెండు, మూడు రోజులు షూటింగ్ చేస్తానని అన్నారు. ఓజీ వస్తుందని, బావుంటుందని అన్నారు.
సోనాక్షి సిన్హా, రితేష్ దేశ్‌ముఖ్, షకీబ్ సలీమ్ కీలక పాత్రల్లో నటించిన సినిమా కాకుద. హారర్ కామెడీ జోనర్లో తెరకెక్కింది. దెయ్యాల రాకపోకల కోసం ప్రతి మంగళవారం తలుపులు తీయాల్సిన ఆచారం ఉన్న ఊళ్లో, ఒకరోజు కొత్త జంట తలుపులు మూసేశాక ఏం జరిగిందనేది కాన్సెప్ట్.
ప్రభాస్ హీరోగా నటించిన సినిమా కల్కి. ఈ సినిమా సెకండ్ చాప్టర్‌ని వచ్చే ఏడాది మే, జూన్‌లో విడుదల చేస్తామని అన్నారు నిర్మాత అశ్వనీదత్. ఈ ఏడాది చివర్లో పార్ట్ 2 షూటింగ్ మొదలుపెడతామని చెప్పారు. పార్ట్ ఒన్‌లో ఎదురైన ఎన్నో ప్రశ్నలకి సెకండ్ చాప్టర్లో సమాధానం దొరుకుతుందని అన్నారు.
యుకె నేషనల్ ఫిల్మ్ అవార్డుల్లో ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్‌కి ఉత్తమ విదేశీ భాషా చిత్రం కేటగిరీలో అవార్డు దక్కింది. పలు హాలీవుడ్ చిత్రాలు పోటీ పడినప్పటికీ కెప్టెన్ మిల్లర్ విజేతగా నిలవడం ఆనందంగా ఉందని అన్నారు దర్శకుడు అరుణ్ మాదేశ్వరన్. ధనుష్ నటనకు అందరూ ఫిదా అయ్యారని చెప్పారు.