Friday, November 15, 2024
Google search engine
HomeUncategorizedEmraan Hashmi: అలా అనకుండా ఉండాల్సింది.. హీరోయిన్‏కు క్షమాపణలు చెప్పిన ఓజీ విలన్.. అసలేం జరిగిందంటే..

Emraan Hashmi: అలా అనకుండా ఉండాల్సింది.. హీరోయిన్‏కు క్షమాపణలు చెప్పిన ఓజీ విలన్.. అసలేం జరిగిందంటే..

Emraan Hashmi: అలా అనకుండా ఉండాల్సింది.. హీరోయిన్‏కు క్షమాపణలు చెప్పిన ఓజీ విలన్.. అసలేం జరిగిందంటే..

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు రొమాన్స్ రారాజు హీరో ఇమ్రాన్ హష్మీ. బీటౌన్‏లో అతడిని సీరియల్ కిస్సర్ అని పిలుస్తారు. విభిన్నమైన సినిమాలతో ఒకప్పుడు వరుస హిట్స్ అందుకున్నాడు. ఎన్నో హిట్ చిత్రాలతో తనదైన నటనతో ప్రశంసలు అందుకున్నాడు. ఇమ్రాన్ హష్మీ నటించిన ప్రతి సినిమాలో లిప్ లాక్ ఉండడం ఖాయం. అందుకే అతడికి సీరియల్ కిస్సర్ అనే ట్యాగ్ కూడా ఉంది. అయితే వరుసగా హిట్స్ అందుకుంటూ స్టార్ డమ్ సొంతం చేసుకున్న ఇమ్రాన్ హష్మీ ఆ తర్వాత వరుస డిజాస్టర్స్ అందుకున్నాడు. దీంతో నెమ్మదిగా అతడి క్రేజ్ తగ్గిపోయింది. ఇమ్రాన్ నటించిన చాలా సినిమాలో బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి. దీంతో ఇప్పుడు విలన్ పాత్రలు, సహాయ పాత్రలు పోషించేందుకు రెడీ అయ్యాడు.. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ఓజీ చిత్రంలో విలన్ పాత్రను పోషిస్తున్నాడు. కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుండగా.. ఇప్పటికే రిలీజ్ అయిన ఇమ్రాన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తిని కలిగించింది.

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డమ్ అందుకున్న ఇమ్రాన్ వివాదాలకు దూరంగా ఉంటాడు. కానీ ఇటీవల కాఫీ విత్ కరణ్ సీజన్ 4లో అతడు చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. రాపిడ్ ఫైర్ సెగ్నెంట్ లో ఇమ్రాన్ మాట్లాడుతూ ఐశ్వర్య రాయ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యను ప్లాస్టిక్ అని పేర్కొన్నాడు. ఇమ్రాన్ చేసిన కామెంట్స్ విని అందరూ షాకయ్యారు. దీంతో అతడిపై ఐష్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక స్టార్ హీరోయిన్ ను అలా అనడమేంటనీ ఇమ్రాన్ పై నెటిజన్స్ మండిపడ్డారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇమ్రాన్ ఐశ్వర్య గురించి తాను చేసిన కామెంట్స్ పట్ల విచారం వ్యక్తం చేశారు.

తన మాటల వల్ల చాలా ఇబ్బంది పడ్డానని… తాను చేసిన కామెంట్స్ అగౌరవంగా ఉన్నాయని అన్నారు. తాను ఐశ్వర్యను కావాలని ప్లాస్టిక్ అని అనలేదని.. కేవలం సరదాగానే అన్నానని.. కానీ తన మాటలు సోషల్ మీడియాలో వివాదాస్పదమయ్యాయని.. అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. కేవలం తాను సరదాగా అన్న మాటలను హైలెట్ చేసి వేరే ఉద్దేశ్యంతో అన్నట్లు ప్రచారం చేశారని.. అందుకు తాను చాలా బాధపడ్డానని.. ఐశ్వర్య అంటే తనకు చాలా గౌరవమని అన్నారు. ఆమె తన మాటల వలన బాధపడితే క్షమపణ అడగడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇమ్రాన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments