Disha Patani: దిశా నడుముపై టాటూ.. కల్కి హీరోయిన్ కొత్త భాష.. అర్థం ఏంటో తెలుసా..?

0
21
కొత్త భాషలో దిశా నడుముపై టాటూ.. అర్థమేంటంటే..

దిశా పటానీ సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో ఒకరు. లోఫర్ సినిమాతో కథానాయికగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత బాలీవుడ్ షిఫ్ట్ అయిపోయింది. దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన ఎంఎస్ ధోని చిత్రంతో బీటౌన్‏లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. హిందీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న దిశా.. ఇక చాలా కాలం తర్వాత ఇప్పుడు కల్కి సినిమాతో మరోసారి సౌత్ అడియన్స్ ముందుకు వచ్చింది ఈ బ్యూటీ. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొణె నటించిన కల్కి సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది. విడుదలైన రెండు వారాల్లోనే రూ.900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సెన్సెషన్ క్రియేట్ చేసింది.

డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మూవీ ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లు రాబట్టింది. భారీ తారగణంతోపాటు భారీ బడ్జెట్‏తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీ థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతుంది. ఇందులో ప్రభాస్ జోడీగా దిశా పటానీ నటించింది. అయితే సినిమా విడుదల సమయంలో దిశా చేతిపై పీడీ (PD) టాటూ కనిపించడంతో నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరిగిన సంగతి తెలిసిందే.

ఇక ఇప్పుడు మరో కొత్త టాటూతో కనిపించింది దిశా. ప్రభాస్ కల్కి సినిమాతో తన అనుభవాన్ని షేర్ చేస్తూ కొన్ని ఫోటోస్, వీడియోస్ పంచుకుంది దిశా పటాని. ఇందులో ఈ బ్యూటీ నడుముపై అర్థం కానీ విదేశీ భాషలో ఉన్న టాటూ కనిపించింది. ఇది చూసిన నెటిజన్స్ అసలు ఆ టాటూ అర్థమేంటనీ తెగ ఆరా తీస్తున్నారు. ఆ టాటూ అర్థం తెలుసుకోవడానికి తెగ ట్రై చేస్తున్నారు. దిశా నడుము మీద ఉన్న టాటూ హీబ్రూ భాషలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్, ఆసియా, ఆఫ్రికా మధ్య ఉండే కొన్ని దేశాల్లో ఈ భాష మాట్లాడతారు. “అతడు నమ్మే ప్రతిదీ పొందవచ్చు” అని ఆ టాటూ అర్థమని తెలుస్తోంది. ఇక దిశా కొత్త టాటూపై ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here