జవాన్ సినిమాతో వెయ్యి కోట్లను దాటిన కెప్టెన్ల క్లబ్లో మెంబర్షిప్ తీసుకున్నారు అట్లీ. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలన్నట్టు, షారుఖ్‌తో నార్త్ లో ఫస్ట్ అటెంప్ట్ తోనే తానేంటో ప్రూవ్ చేసుకున్నారు. ఈ సినిమా తర్వాత అట్లీ చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్టుల మీద ఇంకా క్లారిటీ రాలేదు. కొన్నాళ్లు బన్నీతో మూవీ అన్నారు. ఇప్పుడు సల్మాన్‌తో 2025లో సినిమా స్టార్ట్ అవుతుంది… అందులో ఓ సౌత్ స్టార్ హీరో నటిస్తారని చెబుతున్నారు. వీటి గురించి ఇప్పటికైతే అధికారిక ప్రకటన లేదు… సో సక్సెస్ ఉన్నా.. అట్లీ ఖాళీగానే ఉన్నారు.
వెయ్యి కోట్ల క్లబ్లో సభ్యత్వం తీసుకోకుండా ఇంచు దూరంలో ఆగిపోయారు సందీప్ రెడ్డి వంగా. రణ్‌బీర్‌కపూర్‌తో ఆయన తెరకెక్కించిన యానిమల్ సినిమా 900 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇది బ్లక్ బస్టర్ అయింది.
ప్రభాస్‌తో నెక్స్ట్ స్పిరిట్ చేయడానికి రెడీ అవుతున్నారు సందీప్. అయితే ప్రభాస్‌కి ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ చూస్తుంటే, సందీప్ రెడ్డి సెట్స్ కి ఎప్పుడు వెళ్తారనే విషయంలో క్లారిటీ రావడం లేదు.
అటు సుజీత్ పరిస్థితి కూడా ఇంతకన్నా మారుగా లేదు. సాహోతో నార్త్ లో సూపర్ సక్సెస్ అందుకున్న ఈ కెప్టెన్‌కి, ఆ తర్వాత కాల్షీట్ ఇచ్చిన పెద్ద హీరో పవర్‌స్టారే. ఓజీ సినిమా సెట్స్ మీదుంది. అయితే పవన్ కల్యాణ్‌కి ఇప్పుడున్న కమిట్మెంట్ల దృష్ట్యా ఓజీకి నెక్స్ట్ ఎప్పుడు కాల్షీట్ ఇస్తారనే విషయం మీద స్పష్టత లేదు. ఈ సినిమా అయితేగానీ, సుజీత్ నెక్స్ట్.. నేచురల్ స్టార్ నాని సినిమాను పట్టాలెక్కించలేరు. ఆగుతూ సాగుతున్నట్టుంది సుజీత్ పరిస్థితి.
అట్లీ, సందీప్, సుజీత్ విషయంలో హీరోల పేర్లైనా వినిపిస్తున్నాయి. కానీ నెల్సన్ విషయంలో అది కూడా లేదు. విజయ్ ఆఖరి సినిమాకు నెల్సన్ డైరక్ట్ చేస్తే చేయొచ్చనే మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. జైలర్ లాంటి అద్భుతమైన హిట్ తర్వాత నెల్సన్ ఖాళీగా ఉండటం ఏంటన్నది చాలా మందికి అంతు చిక్కని ప్రశ్న. సినిమా ఫ్లాప్ అయితే ఎవరూ కాల్షీట్ ఇవ్వట్లేదని అనుకోవచ్చు. సక్సెస్ వచ్చాక కూడా ఇంతింత గ్యాప్ ఏంటి గురూ అని ఇంట్రస్టింగ్ డిస్కషన్ షురూ అయింది.