Director Nag Ashwin: కల్కిలో కృష్ణుడిగా మహేష్ బాబు.. అసలు విషయం చెప్పేసిన నాగ్ అశ్విన్..

0
20
కృష్ణుడిగా మహేష్ కనిపించనున్నారా..? డైరెక్టర్ ఏమన్నారంటే..

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది కల్కి 2898 ఏడి. జూన్ 27న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ.700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దాదాపు అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ అయిందని తెలుస్తోంది. భారీ అంజనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికీ పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద జోరు కొనసాగిస్తుంది. మొదటి రోజు నుంచే కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న ఈ చిత్రానికి రెండో వారంలోనూ మరిన్ని వసూళ్లు రావడం ఖాయమని.. త్వరలోనే రూ.1000 కోట్ల క్లబ్‏లో చేరనుందని అంటున్నారు. ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ మూవీలో టాలీవుడ్, కోలీవుడ్ సినీ తారలు గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా సెకండ్ పార్ట్ పై ఇప్పటికే చాలా క్యూరియాసిటీ నెలకొంది. ఈ క్రమంలో శుక్రవారం మీడియాతో ముచ్చటించిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

ఈసినిమాలో అర్జునుడిగా విజయ్ దేవరకొండ నటించగా.. కర్ణుడిగా ప్రభాస్ కనిపించారు. వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ కు థియేటర్లు దద్దరిల్లాయి. అయితే ఈ మూవీ తర్వాత అర్జునుడు, కర్ణుడి గురించి చర్చలు జరిగాయి. అలా చర్చ జరగడం మంచిదే అని.. మహా భారతం గురించి అందరూ తెలుసుకుంటారు. అది మంచిదేగా అని అన్నారు. అలాగే నాని, నవీన్ పొలిశెట్టి లను కూడా రెండు పార్టులో ఎక్కడ వీలైతే అక్కడ ఇరికించేస్తా అని నవ్వుతూ ఆన్సర్ ఇచ్చారు. అలాగే కల్కి సినిమాలో భైరవ పాత్రను సీరియస్ గా కాకుండా సరదాగా ఉండాలనే ఉద్దేశంతో అలా క్రియేట్ చేశానని అన్నారు.

ఇక శ్రీకృష్ణుడిగా మహేష్ బాబు నటిస్తే బాగుంటుందనే చర్చలు సోషల్ మీడియాలో జరిగాయి. నిజంగానే తీసుకుంటారా ? అని అడగ్గా.. కృష్ణుడిగా మహేష్ బాబు బాగుంటాడు. కానీ ఈ సినిమాలో కాకుండా వేరే సినిమాలో చేస్తే బాగుంటుంది అని అన్నారు. అలాగే కల్కి 2లో కమల్ హాసన్ పాత్రను పూర్తిగా చూపిస్తామని అన్నారు. బుజ్జిని డిజైన్ చేసేందుకు టీం చాలా కష్టపడిందని.. బుజ్జి కోసం సపరేట్ లైసెన్స్ కూడా ఇచ్చారని అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here