Deepika Padukone: దీపికకు పుట్టబోయేది ఆడ బిడ్డా? మగ బిడ్డా? ప్రముఖ జ్యోతిష్యుడు ఏం చెప్పాడో తెలుసా?

0
25
దీపికకు పుట్టబోయేది ఆడ బిడ్డా? మగ బిడ్డా?

ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొణె జీవితంలో త్వరలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది . త్వరలో ఆమె పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. దీంతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె దంపతులకు మగపిల్లాడా లేక ఆడపిల్లా అనే చర్చ ఇప్పటికే మొదలైంది. సోషల్ మీడియాలో ఫేమస్ అయిన పండిట్ జగన్నాథ్ గురూజీ ఈ విషయంపై జోస్యం కూడా చెప్పాడు. దీని ప్రకారం దీపికా పదుకొణె మగబిడ్డకు జన్మనివ్వబోతోందని జగన్నాథ్ గురూజీ తెలిపారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పండిట్ జగన్నాథ్ గురూజీ జోస్యం చెప్పారు. దీపికా పదుకొణె, రణ్‌వీర్‌సింగ్‌లకు మగబిడ్డ పుడితే అదృష్టవంతులు అవుతారని అన్నారు. ‘దీపిక, రణ్ వీర్ జాతకం ప్రకారం.. వారికి మగబిడ్డ పుడుతాడు. వారి జీవితానికి యువరాజు అవుతాడు. యువరాజులా ఉండే అబ్బాయి వారికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తారు’ అని పండిట్ జగన్నాథ్ చెప్పుకొచ్చారు. మరి ఈ జ్యోతిష్యుడి అంచనాలు నిజమవుతాయా? కాదా? అన్నది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 29న దీపికా పదుకొణెలు గర్భం దాల్చినట్లు ప్రకటించింది. బహుశా సెప్టెంబర్‌లో దీపికా పదుకొణె తల్లి గా ప్రమోషన్ పొందనుంది.

కాగా నిండు గర్భిణి అయిన దీపిక పదుకొణె ఇటీవల ‘కల్కి 2898 AD’ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంది. ఈ సినిమాలో కూడా గర్భిణి పాత్రలో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. కాగా సినీ పరిశ్రమలో దీపికా పదుకొణెకు చాలా డిమాండ్ ఉంది. అయితే ప్రస్తుతం గర్భవతి కావడంతో సినిమా పనులకు దూరంగా ఉంటోందీ అందాల తార.

ఇవి కూడా చదవండి

కల్కి సినిమా ప్రమోషన్లలో దీపికా పదుకొణె..

దీపిక పదుకొణె లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోలు..

కల్కి తర్వాత దీపిక నటించిన ‘ సింగం అగైన్’ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో రణవీర్ సింగ్ కూడా నటించాడు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 1న విడుదల కానుంది.

కల్కి సినిమాలో దీపికా పదుకొణె..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here