Friday, December 27, 2024
Google search engine
HomeUncategorizedDeepika Padukone: కల్కి బ్యూటీ కాస్ట్లీ చీర.. ఒక లోక్లాస్ ఫ్యామిలీ హైక్లాస్‌గా బతికేయొచ్చు..

Deepika Padukone: కల్కి బ్యూటీ కాస్ట్లీ చీర.. ఒక లోక్లాస్ ఫ్యామిలీ హైక్లాస్‌గా బతికేయొచ్చు..

Deepika Padukone: కల్కి బ్యూటీ కాస్ట్లీ చీర.. ఒక లోక్లాస్ ఫ్యామిలీ హైక్లాస్‌గా బతికేయొచ్చు..

బాలీవుడ్ నటి దీపికా పదుకొణె ఇటీవలే కల్కి సినిమాతో భారీ హిట్ అందుకుంది. ప్రభాస్ హీరోగా నటించిన కల్కి ఏడీ సినిమా సంచలన విజయం సాధించింది. ఈ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది దీపికా. కల్కి సినిమా ఇప్పటికే 800కోట్లకు పైగా వసూల్ చేసింది. దాంతో దీపికా పదుకొణె బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లోనూ లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. ఇక ఈ అమ్మడు పర్సనల్ విషయానికొస్తే.. ఈ ముద్దుగుమ్మ తన మొదటి బిడ్డకు జన్మనివ్వడం కోసం ఎదురుచూస్తోంది.దీపికా ప్రగ్నెన్సీ అని ప్రకటించినప్పటి నుంచి ఆమె పేరు వార్తల్లో మారుమ్రోగుతుంది. కొద్ది రోజుల క్రితం కల్కి సినిమా ప్రమోషన్‌లో బ్లాక్ డ్రెస్‌లో కనిపించింది. గర్భంతో ఉండి కూడా సినిమా కోసం ప్రమోషన్స్ కు వచ్చిన దీపికా పది అందరూ ప్రశంసలు కురిపించారు. తాజాగా దీపిక ఊదారంగు చీరలో క్యూట్ గా కనిపించి చీర ధరపై వార్తల్లో నిలిచింది.

ఇది కూడా చదవండి : అరియానాతోనూ రాజ్ తరుణ్‌కు ఎఫైర్.. ఒకొక్క యవ్వారం బయటపెడుతున్న లావణ్య

జూలై 5న ముంబైలో జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ మ్యారేజ్ ఈవెంట్ లో నటి దీపికా పదుకొణె ఊదారంగు చీరలో అబ్బురపరిచింది. ఈ ఈవెంట్‌లో సింపుల్ మేకప్ లుక్‌లో కనిపించిన ఈ బ్యూటీ చీరకు సరిపోయే పెరల్ చోకర్‌ను ధరించింది. దీపికా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ ఫోటోలను షేర్ చేసింది, ఈ చీరలో బేబీ బంప్‌తో ఫోటోలకు పోజులిచ్చింది. ఈ ఫోటోలు వైరల్‌గా మారడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు.

ఇది కూడా చదవండి : Jabardasth Faima: పెళ్లి ఎప్పుడో చెప్పేసిన జబర్దస్త్ ఫైమా.. ప్రియుడి ఇంటిపేరు ఇదే

అంబానీ మ్యారేజ్ ఈవెంట్ కోసం నటి దీపిక ధరించిన పర్పుల్ కలర్ చీరను డిజైనర్ కరణ్ తోరానీ డిజైన్ చేశారు. ఈ ఊదారంగు షిఫాన్ చీరలో బంగారు ఎంబ్రాయిడరీ ఉంది అలాగే దీన్ని తయారు చేయడానికి 3,400 గంటలు పట్టిందని చెబుతారు. ప్రస్తుతం దీపిక ధరించిన ఈ చీర ధర వార్తల్లో నిలుస్తోంది. ఇది టోరానీ క్లాసిక్ కలెక్షన్ చీర ధర రూ.1,39,500, బ్లౌజ్ ధర రూ.46,500తోపాటు మరికొన్ని వాటి ధర రూ.7,500. ఈ చీర మొత్తం ధర సుమారు 1 లక్షా 92 వేల రూపాయలు.

దీపికా పదుకొణె ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments