Darshan Case : జైల్లో తండ్రిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న దర్శన్ కొడుకు..

0
26
జైల్లో తండ్రిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న దర్శన్ కొడుకు..

నటుడు దర్శన్ ప్రస్తుతం జైలులో ఉన్నారు. బెంగుళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్నాడు దర్శన్. రేణుకా స్వామి అనే వ్యక్తిని హత్య చేసినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. తప్పు ఎవరు చేసినా అది తప్పే.. ప్రస్తుతం జైల్లో దర్శన్‌ ఉచాలు లెక్కపెడుతున్నాడు. అతను ఆహారం తినడం లేదు.. అలాగే అతనికి నిద్ర పట్టదు. ఇప్పటికే పది కేజీల వరకు బరువు తగ్గాడని తెలుస్తోంది. కాగా ఇప్పటివరకు దర్శన్ కుటుంబం జైలులో అతనిని మూడుసార్లు కలిసి. జూలై 11న భార్య విజయలక్ష్మి, కుమారుడు వినీష్ సహా కుటుంబ సభ్యులు వచ్చి దర్శన్‌ను కలిసి అతనికి ధైర్యం చెప్పారు. అలాగే లాయర్ కూడా తరచు దర్శన్ ను కలుస్తున్నారు.

దర్శన్ ని కలిసినప్పుడు విజయలక్ష్మి అతనిలో ధైర్యం నింపింది. వారు దర్శన్ కు బట్టలు, పండ్లు ఇచ్చారు. జైలులో ఉన్న తండ్రి పరిస్థితి చూసి కొడుకు భావోద్వేగానికి గురయ్యాడు. నాన్న అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. కొడుకుని కౌగిలించుకుని దర్శన్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడని తెలుస్తోంది.

తాను జైలులో ఉండలేనని.. ఇక్కడి తిండి తినలేను అని చెప్పాడట దర్శన్. దీనికి సంబంధించి న్యాయవాది ద్వారా కోర్టులో దరఖాస్తు చేసుకున్నట్లు విజయలక్ష్మి దర్శన్‌కు తెలిపారు. ప్రస్తుతం ఇంటి భోజనం అందించడంపై కోర్టులో పిటిషన్ విచారణ జరుగుతోంది. దీనిపై జూలై 18న నిర్ణయం తీసుకోనున్నారు. బయట జరుగుతున్న విషయాలు భార్యను అడిగి తెలుసుకున్నాడు దర్శన్. బెయిల్ ప్రక్రియపై కుటుంబ సభ్యులతోనూ చర్చించారు. కొడుకుని చూసి దర్శన్ ఎంతగానో సంతోషించాడు. దర్శన్ వ్యాయామం లేకుండా, సరైన ఆహారం లేకుండా మానసికంగా కుంగిపోయాడు అతడు. కుటుంబసభ్యులు వచ్చి ప్రోత్సహించినా దర్శన్‌లో అలజడి పోలేదు అని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here