Darshan: ‘మా హీరో రిలీజ్ అయ్యే వరకు చెప్పులు వేసుకోను’.. హద్దులు దాటుతోన్న దర్శన్ అభిమానులు

0
22
Darshan: ‘మా హీరో రిలీజ్ అయ్యే వరకు చెప్పులు వేసుకోను’.. హద్దులు దాటుతోన్న దర్శన్ అభిమానులు

Darshan: ‘మా హీరో రిలీజ్ అయ్యే వరకు చెప్పులు వేసుకోను’.. హద్దులు దాటుతోన్న దర్శన్ అభిమానులు

హత్యానేరంపై నటుడు దర్శన్‌ అరెస్ట్‌ తర్వాత ఆయన అభిమానులు కొందరు అతిగా స్పందిస్తున్నారు. జైల్లో దర్శన్ కు ఇచ్చిన ఖైదీ నంబర్ ను అభిమానులు టాటూలుగా వేసుకుంటూ గర్వంగా చూపించుకుంటున్నారు. మరో అభిమాని చిన్నారికి ఖైదీ నెంబర్ వేసి ఫోటోషూట్ చేశాడు. అలాగే 6106 నంబర్ ను తమ వాహనాలకు నంబర్ ప్లేట్లుగా తగిలించుకుంటున్నారు. ఇప్పుడు మైసూర్‌కి చెందిన ఒక అభిమాని మరీ రెచ్చిపోయాడు. దర్శన్ రిలీజయ్యేంతవరకు చెప్పులు వేసుకోనని ఏకంగా శపథం చేశాడు. అలాగే తమ హీరో విడుదలైతే దేవునికి కానుకలు సమర్పిస్తామని ప్రకటించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. మరోవైపు దర్శన్ కు కేటాయించిన నంబర్ ను స్టిక్కర్లుగా అతికించుకుంటూ హల్ చల్ చేస్తున్నారు. అలా అత్యుత్సాహం చూపిన ఓ ఆటో డ్రైవర్ కు పోలీసులు గట్టిగా బుద్ధి చెప్పారు. వివరాల్లోకి వెళితే..

జగదీష్ అలియాస్ జగ్గా అనే ఆటో డ్రైవర్ ప్రమాదకరంగా ఆటోను నడిపాడు. ట్రాఫిక్ ఉన్న రోడ్లపై ఆటో వీలింగ్ చేశాడు. అతని క్రేజీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన కామాక్షిపాళ్య ట్రాఫిక్ పోలీసులు ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆటో డ్రైవర్ వీలింగ్ చేస్తున్న దృశ్యం వైరల్ కావడంతో ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. వాహనం నంబర్‌ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. హెచ్చరించి బెయిల్‌పై విడుదల చేశారు. అలాగే ఆటో వెనుక వేసిన ‘డి బాస్ 6106’ అనే స్టిక్కర్‌ను పోలీసులు తొలగించారు. కొద్దిరోజుల క్రితం ‘ఖైదీ నంబర్ 6106’ విషయంలో మరో దారుణమైన సంఘటన నమోదైంది. చిన్న పిల్లాడికి ఈ నెంబర్ వేసుకుని ఫోటో షూట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు తీవ్ర విమర్శలు చేశారు. చిత్రదుర్గలోని రేణుకా స్వామిని హత్య చేసిన కేసులో దర్శన్ జైలులో ఉన్నాడు. ఆయనతో పాటు పవిత్ర గౌడ తదితరులు కూడా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. జైల్లో ఉన్న దర్శన్ ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు సమాచారం.

చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడైన నటుడు దర్శన్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడైన దర్శన్ జ్యుడీషియల్ కస్టడీలో ఉండి ప్రస్తుతం బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో ఉన్నాడు. జూన్ 11 మంగళవారం నాడు దర్శన్‌ను అరెస్టు చేశారు. పోలీసుల విచారణ అనంతరం కోర్టు అతడిని జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.ఆ తర్వాత దర్శన్ జ్యుడీషియల్ కస్టడీని జూలై 18 వరకు పొడిగించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here