Darshan: దయచేసి అలా చేయకండి.. అభిమానులకు దర్శన్ విజ్ఙప్తి.!

0
15
దయచేసి అలా చేయకండి.. అభిమానులకు దర్శన్ విజ్ఙప్తి.!

నటుడు దర్శన్ కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది. సెలబ్రిటీగా విలాసవంతమైన జీవితం గడిపిన ఆయన ఇప్పుడు జైలులో ఊచలు లెక్కబెడుతున్నాడు. దీనంతటికీ కారణం రేణుకా స్వామి హత్య కేసు. దర్శన్ జైలుకు వెళ్లగానే ఆయన అభిమానులు ఆందోళనకు దిగారు. కొందరు మితిమీరి ప్రవర్తించారు. ఇప్పుడు దర్శన్ జైలు నుంచి.. అభిమానుల గురించి ఆరా తీశారని తెలుస్తోంది. ఈ మేరకు న్యాయవాది నారాయణస్వామి కామెంట్స్ చేశారు. జూలై 10న పరప్ప అగ్రహారంలో దర్శన్, పవిత్ర గౌడలను లాయర్ నారాయణస్వామి కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కొన్ని విషయాలు తెలిపారు. హీరో దర్శన్ తన అభిమానులకు చేసిన రిక్వెస్ట్‌ను రివీల్ చేశారు.

ఇక వేరు వేరుగా దర్శన్, పవిత్ర గౌడలను కలిసిన లాయర్ నారాయణ స్వామి.. దర్శన్ తో బెయిల్‌ ప్రక్రియపై చర్చించినట్లు మీడియాకు వివరించారు. అలాగే తదుపరి న్యాయపోరాటానికి గల అవకాశాలపై కూడా దర్శన్‌తో చర్చించామన్నారు. ఇక జైల్లో ఉన్న దర్శన్ తన అభిమానుల గురించి ఆరా తీశారని.. ! ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని ఆయన అభిమానులను అభ్యర్థించినట్లు లాయర్ తెలిపారు.

ఇక దర్శన్ జైలుకు వెళ్లిన తర్వాత కొందరు అభిమానులు నెగిటివ్ స్టేట్‌మెంట్లు ఇచ్చారు. కొందరు సోషల్ మీడియాలో దారుణంగా ప్రవర్తించారు. అలాగే, ఖైదీ నంబర్ 6106 విషయంలో కూడా కొందరు కామెంట్స్ తో పాటు పిచ్చి పిచ్చి పనులు కూడా చేశారు. ఇటీవల ఓ ఆటోడ్రైవర్ అదే నబర్‌ను ఆటోకు వేసి రోడ్డు పై స్టంట్స్ చేశాడు. అలాగే ఓ వ్యక్తి పసి పిల్లాడికి ఖైదీ డ్రస్ వేసి దానిపై 6106 అనే నెంబర్ వేశాడు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి దర్శన్ విజ్ఞప్తి చేశాడు కనుక.. ఇప్పుడైనా ఆయన అభిమానులు కుదురుగా ఉంటారో లేదో చూడాలి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here