నటుడు దర్శన్ కేసు రోజుకొక మలుపు తిరుగుతుంది. సెలబ్రిటీగా విలాసవంతమైన జీవితం గడిపిన ఆయన ఇప్పుడు జైలులో ఊచలు లెక్కబెడుతున్నాడు. దీనంతటికీ కారణం రేణుకా స్వామి హత్య కేసు. దర్శన్ జైలుకు వెళ్లగానే ఆయన అభిమానులు ఆందోళనకు దిగారు. కొందరు మితిమీరి ప్రవర్తించారు. ఇప్పుడు దర్శన్ జైలు నుంచి అభిమానుల గురించి ఆరా తీశారని తెలుస్తోంది. ఈ మేరకు న్యాయవాది నారాయణస్వామి కామెంట్స్ చేశారు. జూలై 10 పరప్ప అగ్రహారంలో దర్శన్, పవిత్ర గౌడలను లాయర్ నారాయణస్వామి కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కొన్ని విషయాలు పంచుకున్నారు.
దర్శన్, పవిత్ర గౌడలను వేర్వేరుగా కలిశారు ఈ లాయర్. ఆయన దర్శన్ తో బెయిల్ ప్రక్రియపై చర్చించినట్లు తెలిపారు. అలాగే తదుపరి న్యాయపోరాటానికి గల అవకాశాలపై కూడా చర్చించారు. జైల్లో ఉన్న దర్శన్ అభిమానుల గురించి ఆరా తీశారు.! ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని దర్శన్ అభిమానులను అభ్యర్థించినట్లు లాయర్ తెలిపారు.
దర్శన్ జైలుకు వెళ్లిన తర్వాత కొందరు అభిమానులు నెగిటివ్ స్టేట్‌మెంట్లు ఇచ్చారు. కొందరు సోషల్ మీడియాలో దారుణంగా ప్రవర్తించారు. అలాగే, ఖైదీ నంబర్ 6106 విషయంలో కూడా కొందరు కామెంట్స్ తో పాటు పిచ్చి పిచ్చి పనులు కూడా చేశారు. ఇటీవల ఓ ఆటోడ్రైవర్ అదే నంబర్‌ను ఆటోకు వేసి రోడ్డు పై స్టంట్స్ చేశాడు. అలాగే ఓ వ్యక్తి పసిపిల్లాడికి ఖైదీ డ్రస్ వేసి దానికి 6106 అనే నెంబర్ వేశాడు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి దర్శన్ విన్నపం తర్వాత అయినా ఇలాంటి అభిమానులు కుదురుగా ఉంటారో లేదో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.