Darshan: ‘పవిత్ర గౌడ దర్శన్ భార్య కాదు.. వారిద్దరి మధ్య ఉన్న సంబంధమిదే’.. పోలీసులకు హీరో సతీమణి లేఖ

0
35
Darshan: 'పవిత్ర గౌడ దర్శన్ భార్య కాదు.. వారిద్దరి మధ్య ఉన్న సంబంధమిదే'.. పోలీసులకు హీరో సతీమణి లేఖ

ప్రముఖ కన్నడ నటుడు, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ వ్యక్తిగత జీవితంపై ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. అభిమాని రేణుకాస్వామి హత్యోదంతంతో ఇదంతా మొదలైంది. ఈ కేసులో దర్శన్ , నటి పవిత్ర గౌడ సహా పలువురు అరెస్టయ్యారు. కాగా పోలీసు కమిషనర్ దయానంద్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘పవిత్ర గౌడ దర్శన్ భార్య’ అని మీడియాకు వెల్లడించారు. ఆ తర్వాత జాతీయ మీడియాలో కూడా అదే ప్రసారమైంది. దీంతో ఈ విషయంపై దర్శన్ భార్య విజయలక్ష్మి దర్శన్ బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్‌కు ప్రత్యేక లేఖ రాశారు. దర్శన్, పవిత్ర గౌడ సన్నిహితంగా ఉంటున్నారనేది రహస్యమేమీ కాదని, అయితే వారిద్దరూ భార్యాభర్తలు కాదని విజయలక్ష్మి స్పష్టం చేసింది. బెంగళూరు పోలీస్ కమిషనర్‌కు రాసిన లేఖలో విజయలక్ష్మి ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ విషయమై పోలీసు రికార్డుల్లో సరైన సమాచారం ఉండాలని విజయలక్ష్మి కోరారు.

‘‘విలేకర్ల సమావేశంలో దర్శన్ భార్య పవిత్ర గౌడ అని మీరు తప్పుగా చెప్పారు. ఆ తర్వాత రాష్ట్ర హోంమంత్రులతో పాటు జాతీయ మీడియా కూడా ఇదే మాట చెప్పింది. రేణుకాస్వామి హత్యకేసులో దర్శన్ దంపతులు అరెస్టయ్యారని కథనాలు ప్రసారమయ్యాయి. దీని వల్ల నాకు, నా కొడుకు వినేష్‌కి భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. పవిత్ర గౌడ సంజయ్ సింగ్‌ను వివాహం చేసుకుకుంది. వారిద్దరికీ ఒక కూతురు కూడా ఉంది. ఈ సమాచారం పోలీసు రికార్డుల్లో స్పష్టంగా ఉండాలి. దీని వల్ల భవిష్యత్తులో నాకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. నాకు న్యాయవ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ కేసు విషయంలో చట్టం తన పని తాను చేసుకుని పోతుంది. అయితే ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న పవిత్ర గౌడకు సంబంధించిన సమాచారం సముచితంగా ఉండాలని కోరుతున్నాను. ఆమె నా భర్త స్నేహితురాలు అన్నది నిజం. అయితే ఆమె నా భర్త భార్య కాదని దయచేసి తెలుసుకోండి. దర్శన్‌ని నేను మాత్రమే చట్టబద్ధంగా వివాహం చేసుకున్నాను. 2003 మే 19న ధర్మస్థలలో మా వివాహం జరిగింది’ అని విజయలక్ష్మి లేఖలో తెలియజేశారు.

ఇవి కూడా చదవండి

దర్శన్ కుటుంబంలో విభేదాలు రావడానికి పవిత్ర గౌడ కారణమని తెలుస్తోంది.. ఇప్పుడు రేణుకాస్వామి హత్య కేసులో పవిత్ర కూడా ఏ1గా ఉన్నారు. దర్శన్ A2. పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపాడన్న కారణంగా చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామిని బెంగుళూరుకు పిలిపించి హత్య చేసినట్లు దర్శన్‌పై ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఖైదీ వేషధారణలో ఏడాది బాలుడు.. ఫొటోస్ ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here