Darshan: జైల్లో బక్కచిక్కిపోతోన్న హీరో దర్శన్.. గత 16 రోజుల్లో ఏకంగా ఎన్ని కిలోలు తగ్గాడో తెలుసా?

0
21
బక్కచిక్కిపోతోన్న దర్శన్.. 16 రోజుల్లో ఎన్ని కిలోలు తగ్గాడంటే?

రేణుకాస్వామి హత్య కేసులో హీరో దర్శన్ తూగుదీప్ అరెస్టయి నెల రోజులు కావస్తోంది. బయట విలాసవంతమైన జీవితం గడిపిన దర్శన్ ఇప్పుడు జైలులో ఖైదీగా కాలం గడుపుతున్నాడు. ప్రతిరోజు పార్టీలతో ఫుల్ గా ఫ్రెండ్స్ తో తిరుగుతూ, నిత్యం నాన్ వెజ్ వంటకాలతో విలాసంగా గడిపిన ఈ స్టార్ హీరో ఇప్పుడు జైలు నాలుగు గోడల మధ్య బంధీగా మారిపోయాడు. దీంతో అతను మానసిక క్షోభకు గురవుతున్నాడని, ఆరోగ్యం కూడా దెబ్బతింటోందని తెలుస్తోంది. ఈ కారణంగా పరప్పణ అగ్రహార జైలు అధికారుల్లో ఆందోళన నెలకొందని తెలుస్తోంది. రేణుకాస్వామి హత్య తర్వాత జూన్ 11న దర్శన్‌ని అరెస్టు చేశారు. అప్పటి నుంచి దర్శన్ జైల్లోనే ఉన్నాడు. కేసు కారణంగా మానసికంగా కుంగిపోయిన దర్శన్.. జైల్లో శరీరానికి సరైన తిండి దొరక్క కుంగిపోతున్నాడు. గత పదహారు రోజుల్లోనే దర్శన్ 10 కిలోల బరువు తగ్గాడని అంటున్నారు. దర్శన్ ఆరోగ్యంపై పరప్ప అగ్రహార జైలు అధికారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నిత్యం బరువు తగ్గుతున్న దర్శన్ అస్వస్థతకు గురయ్యే అవకాశం ఉందని, అందుకే ఆయన ఆరోగ్యంపై అధికారులు నిఘా ఉంచారని చెబుతున్నారు.

పరప్ప అగ్రహార జైలుకు వచ్చిన దర్శన్ కు, ఇప్పటికీ చాలా తేడా ఉంటుందని అంటున్నారు జైలు సిబ్బంది. జైల్లో ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకుండా ఒంటరిగా ఉండటానికే దర్శన్ ఇష్టపడతాడని అంటున్నారు. ఇదంతా దర్శన్ ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో జైలు అధికారులు దర్శన్ ఆరోగ్యంపై నిఘా పెట్టారు. దర్శన్ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

గతంలో దర్శన్, పవిత్ర గౌడ ఇద్దరూ పోలీసుల అదుపులో ఉండగా, పవిత్ర గౌడ రెండు సార్లు అస్వస్థతకు గురైంద. ఆమె బీపీ హెచ్చుతగ్గులకు లోనైంది. దీంతో ఆస్పత్రిలో చేరి చికిత్స అందించారు. అయితే దర్శన్‌కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురుకాలేదు. అయితే పరప్ప అగ్రహార జైలులో చేరిన తర్వాత అతనికి ఆరోగ్య సమస్య వచ్చినట్లు తెలుస్తోంది. అతని శరీర బరువు కూడా బాగా తగ్గుతోంది. దర్శన్, ఇతర నిందితుల జ్యుడీషియల్ కస్టడీ గడువు జూలై 4తో ముగిసింది. అయితే నిందితుల జ్యుడీషియల్ కస్టడీని న్యాయమూర్తి జూలై 18 వరకు పొడిగించారు. జులై 18లోపు దర్శన్ కు బెయిల్ రావడం అనుమానమే అని అంటున్నారు.

శ్రుతి మించుతున్న అభిమానం..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here