Danush : అది ఎన్టీఆర్ క్రేజ్ అంటే..! తారక్ ఫ్యాన్స్‌ను ఖుష్ చేసిన ధనుష్..

0
26
అది ఎన్టీఆర్ క్రేజ్ అంటే..! తారక్ ఫ్యాన్స్‌ను ఖుష్ చేసిన ధనుష్..

తమిళ్ తోపాటు తెలుగులోనూ ,మంచి క్రేజ్ ఉన్న హీరోలు ధనుష్ ఒకడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రొటీన్ కథలతో కాకుండా డిఫరెంట్ సినిమాలు చేసి టాప్ హీరోగా ఎదిగాడు. కేవలం తమిళ్ లోనే కాదు తెలుగు, హిందీతో పాటు హాలీవుడ్ సినిమాలోనూ నటించాడు ధనుష్. ఇక తెలుగులో వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన సార్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా తెలుగు, తమిళ్ రెండు భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత కెప్టెన్ మిల్లర్ అనే సినిమా చేశాడు. కానీ ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇక ఇప్పుడు రాయన్ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించనున్నాడు ధనుష్. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది కూడా చదవండి : Prabhas: ప్రభాస్ సినిమా కోసం పాకిస్థాన్ హీరోయిన్‌ను దింపుతున్నారా.?

ఈ సినిమా ప్రీరిలీజ్ ఈ వేణు తాజాగా హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సినిమాలో ధనుష్ హీరోగా నటించడమే కాదు.. ఆయనే స్వయంగా దర్శకత్వం కూడా వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ధనుష్ చేసిన కామెంట్స్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్నాయి. ధనుష్ కు ఈ ఈవెంట్ లో  టాలీవుడ్ లో ఏ హీరోతో కలిసి నటించాలని మీరు అనుకుంటున్నారు అనే ప్రశ్న ఎదురైంది.

ఇది కూడా చదవండి : Naga Chaitanya: నాగచైతన్యకు అమ్మగా, ఫ్రెండ్‌గా, లవర్‌గా నటించిన ఏకైక హీరోయిన్ ఈమె..

మల్టీస్టారర్‌ మూవీ ఛాన్స్‌ వస్తే రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌, మహేశ్‌ బాబు, ఎన్టీఆర్‌ వీరిలో ఎవరితో కలిసి నటిస్తారు అన్న ప్రశ్నకు.. ధనుష్ తారక్ తో మల్టీస్టారర్ మూవీ చేస్తా అని సమాధానం ఇచ్చారు. దాంతో తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఏ స్టార్ హీరోయినా తమ హీరోతో కలిసి నటించాలని కోరుకుంటారు అంటూ తారక్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో చాలా మంది తమిళ్ , హిందీ హీరోలు ఎన్టీఆర్ తో నటించాలని ఉంది అని మనసులో మాటను బయట పెట్టారు. ఇప్పుడు ధనుష్ కూడా తారక్ పేరు చెప్పడంతో ఎన్టీఆర్ అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు. ఇక రాయన్  సినిమా విషయానికొస్తే ఈ సినిమాలో సందీప్‌ కిషన్, కాళిదాస్‌ జయరామ్, అపర్ణ బాలమురళి, ప్రకాశ్‌రాజ్‌,నిత్యా మీనన్‌,ఎస్‌ జే సూర్య,సెల్వరాఘవన్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రాయన్  సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయనున్నారు. జులై 26న రాయన్‌ విడుదల కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here